జీఎస్‌టీ అమలులోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ రేట్లలో మార్పులు చేయాలని భావిస్తోంది. రెవెన్యూ లోటుతో ఇబ్బంది పడుతున్న మోదీ ప్రభుత్వం తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలను వెతుకుతుంది. ఇందులో భాగంగానే జీఎస్‌టీ రేట్లను పెంచాలని భావిస్తోంది.

 

కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం జీఎస్టీ స్లాబులను మార్చాలనే యోచనలో ఉందని తెలుస్తుంది. ప్రస్తుతమున్న 5 శాతం జీఎస్‌టీ స్లాబును 9-10 శాతానికి పెంచాలని చూస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అలాగే 12 శాతంలోని 243 ఐటమ్స్‌ను 18 శాతం రేటు స్లాబులోకి వస్తాయి అంటున్నారు. ఇదే జరిగితే కన్సూమర్లపై పన్ను భారం పెరిగి ప్రభుత్వానికి ఆదాయం పెరగనుంది అని తెలుస్తుంది.

 


మోదీ సర్కార్ కొన్నింటికి జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఖరీదైన ప్రైవేట్ హాస్పిటల్స్, రూ.1,000లోపు హోటల్ రూమ్ బాడుగ వంటి వాటికి మినహాయింపు ఉంది. అయితే కేంద్రం వీటిని మళ్లీ పన్ను పరిధి కిందకు తీసుకురావాలని అంకుంటున్నట్లు తెలిపారు. జీఎస్‌టీ అమలులోకి వచ్చిన తర్వాతి కేంద్ర ప్రభుత్వం ఆదాయంలో రూ.2.5 లక్షల కోట్ల మేర తగ్గిందని భావిస్తున్నారు.

 

కేంద్ర ప్రభుత్వం జీరో ట్యాక్స్ కేటగిరిలో ఉన్న వస్తువుల జోలికి వెళ్లకపోవచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అధిక ఆదాయం వచ్చే వస్తువుల పైనే  ప్రభావం ఉండొచ్చు. అయితే రేట్లు పెరిగితే ద్రవ్యోల్బణ ప్రభావాలు ఎదుర్కోవలసి వస్తుందని నిపుణనులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి జీఎస్టీ రేట్ల మార్పుకు సంబంధించి వచ్చే వారం కేంద్రంతో జరగనున్న సమావేశంలో చర్చించనున్నారు.  ఎకానమీ క్లాస్ ఎయిర్ ట్రావెల్, ఫస్ట్/సెకండ్ క్లాస్ ఏసీ ట్రైన్ ట్రావెల్, పామ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, పిజ్జా బ్రెడ్, డ్రై ఫ్రూట్స్, సిల్క్, క్రూయిజ్ ట్రావెల్, టూర్ సర్వీసెస్, ఔట్‌డోర్ కేటరింగ్, రెస్టారెంట్స్ వంటి వాటివి ఎక్కువ పన్ను రేటు స్లాబులోకి రావచ్చు అనే వార్తలు వస్తున్నాయి. దీంతో వీటి ధరలు పెరగొచ్చు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: