జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత ఎవరూ అనే వ్యాఖ్యలకు సమాధానం చెప్పిన వారిలో నాదెండ్ల మనోహర్ ముందు వరుసలో ఉంటారు. అందరూ మాజీ ఐఆర్ఎస్ అధికా రి తోట‌ చంద్ర శేఖర్ అని భావించారు. కాని ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ కి పవన్ కళ్యాణ్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఆయనకు పార్టీలో కీలక పదవి ఇవ్వడంతో పాటు గా వరుస పర్యటనలు కూడా ఆయనతో కలిసి చేసారు. ప్రజా సమస్యల విషయంలో ఆయనతో కలిసి పోరాటం చేసారు నాదెండ్ల మనోహర్. ఇక పార్టీ ఓడిపోయినా సరే ఆయన మాత్రం పవన్ వెంటే నడిచారు.

 

పవన్ ఎక్కడికి వెళ్ళినా సరే నాదెండ్ల మనోహర్ ఉంటున్నారు. లాంగ్ మార్చ్ నిర్వహించినా, మీడియా సమావేశాలు నిర్వహించినా, రాజధాని పర్యటనకు వెళ్ళినా సరే నాదెండ్ల పవన్ వెంట ఉన్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిర్ణయాలు నాదెండ్ల కు చిరాకు గా మారాయని అంటున్నారు. జనసేన పార్టీని బిజెపిలో ఆయన విలీనం చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ నిర్ణయం నాదెండ్ల కు అసలు ఇష్టం లేదని ఆ పార్టీ వర్గాలు అంటున్నారు. 

 

అసలు పార్టీ పెట్టి ఒక ఎన్నిక‌ల్లో మాత్ర‌మే పోటీ చేయ‌డం... ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన నాలుగు నెల‌ల నుంచే పోరాడకుండా విలీనం మాటలు మాట్లాడటం, చంద్రబాబుని తిట్టి ఆయనతో కలిస్తే జగన్ ఓడిపోయే వారు అని వ్యాఖ్యానించడం, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా అంటే గౌరవం ఉందని వ్యాఖ్యానించడం వంటివి నాదెండ్ల కు చికాకు తెప్పించాయని అంటున్నారు. దీనితో జ‌న‌సేన చీలిపోయిన‌ట్టే అనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. 

 

పార్టీలో పవన్ నిర్ణయాన్ని మెజారిటి నేతలు వ్యతిరేకిస్తున్నారని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజల్లో పరువు పోయినా ఆశ్చర్యం లేదని... ఒకవేళ కలిపితే తెలుగుదేశంలో కలుపుకోవాలి గాని బిజెపిలో కలపడం ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప‌వ‌న్ ఒంటెద్దు పోడ‌క నిర్ణ‌యాలు న‌చ్చని మ‌నోహ‌ర్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నార‌న్న టాక్ జ‌న‌సేన వ‌ర్గాల్లోనే వినిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: