టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం ఖాయం అయ్యింది. ఆ విషయం ఆయనే స్వయంగా మీడియా ముందు చెప్పారు. అయితే వల్లభనేని చేరికతో గన్నవరంలో అప్పటి వరకూ వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న యార్లగడ్డ వెంకటరావు వర్గం ఇబ్బంది పడుతోంది. తమ నాయకుడి భవిష్యత్ ఏంటన్న ఆందోళన కూడా వచ్చింది.

 

అయితే వల్లభనేని వంశీ విషయంలో యార్లగడ్డను బుజ్జగించేందుకు వైసీపీ అన్ని విధాలా ప్రయత్నించింది. ఈ విషయంలో కొంత మేరకు సక్సస్ అయ్యింది. తగిన విధంగా ప్రత్యామ్నాయం చూస్తామని స్వయంగా జగన్ హామీ ఇచ్చారు కూడా. ఇప్పుడు జగన్ ఆ హామీని నిలబెట్టుకున్నారు.

 

ఎలాగంటే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా 13 జిల్లాల సహకార సెంట్రల్‌ బ్యాంక్‌లకు పర్సన్‌ ఇంచార్జ్‌ కమిటీలను నియమించింది. ప్రతి డీసీసీబీకి 7గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకటరావుకు కృష్ణాజిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా జగన్ మాట నిలబెట్టుకున్నారు.

 

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసిపికి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో వెంకట్రావుకు ఈ పదవితో న్యాయం చేశారనే చెప్పుకోవాలి. ఇక మిగిలిన జిల్లాల డీసీసీబీలకు ఎవరిని ఛైర్ పర్సన్ లుగా నియమించారంటే..

 

జిల్లాల వారీగా డీసీసీబీ చైర్‌పర్సన్‌ల వివరాలు..

1) శ్రీకాకుళం- పాలవలస విక్రాంత్‌

2) విజయనగరం- మరిసర్ల తులసి

3) విశాఖపట్నం- సుకుమార్ వర్మ

4) తూర్పుగోదావరి- అనంత ఉదయ్‌భాస్కర్‌

5) పశ్చిమగోదావరి- కవురు శ్రీనివాస్‌

 

6) కృష్ణా జిల్లా- యార్లగడ్డ వెంకటరావు

7) గుంటూరు- రాతంశెట్టి సీతారామాంజనేయులు

8) ప్రకాశం- మాదాసి వెంకయ్య

9) నెల్లూరు- ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి

10) చిత్తూరు- ఎం.రెడ్డమ్మ

11) కర్నూల్- మాధవరం రామిరెడ్డి

12) వైఎస్సార్‌ కడప- తిరుపాల్ రెడ్డి

13) అనంతపురం- బోయ వీరాంజనేయులు

మరింత సమాచారం తెలుసుకోండి: