జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు చూస్తుంటే.. బీజేపీతో పొత్తు పెట్టుకోవడమో.. లేదా.. తన పార్టీని బీజేపీలో కలిపేయడమో ఏదో ఒకటి ఖాయం అన్న భావన రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. అవకాశం దొరికితే చాలు ఆయన మోడీనో, అమిత్ షానో,ఆర్ ఎస్ ఎస్ నో పొగిడేస్తున్నారు.

 

ఆర్ఎస్ఎస్ మాదిరి పదిమంది కార్యకర్తలు ఉంటే చాలని ఆయన తన చిత్తూరు జిల్లా పర్యటనలో తెగ పొగిడేశారు. ఆర్.ఎస్.ఎస్ తరహాలో పార్టీని అభివృద్ధి చేయాలన్నారు. ఎంతో మంది జీవితాలను దేశానికి వదిలేసి నిర్మించారని.. వారితో మనం పోటీ పడలేం అంటూ ప్రశంసలు కురిపించారు.

 

తాజాగా పవన్ కల్యాణ్ మోడీ ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ప్లాగ్ డే సందర్భంగా ఆయన ఈ విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. సైనిక కుటుంబాల కోసం ఆయన ఈ విరాళం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ డి డి ని తానే డిల్లీ వెళ్లి సంబందిత అదికారులకు అందిస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు. దేశం పట్ల తన బాధ్యతను గుర్తు చేశారని ప్రధాని మోడీకి ఆయన కృతజ్ఞతలు చెప్పారు.

 

మరి.. పవన్ కల్యాణ్ స్వయంగా ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. ఆయనకు మోడీ తన కర్తవ్యం గుర్తు చేశారట. అందుకు కృతజ్ఞతలట. పాపం.. మోడీ కంట్లో పడేందుకు ఆయన ఏకంగా సైనిక బలగాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అంతేకాదు.. అసలు తాను బీజేపీతో ఎప్పుడూ దూరంగా లేనంటూ కొత్త రాగం ఆలపించారు. మరి బీజేపీ ప్రాపకం కోసం పవన్ కల్యాణ్ ఎందుకు ఇంతగా తపించిపోతున్నారు.. ఇప్పుడు విశ్లేషకుల మెదళ్లకు పని చెప్పిన ప్రశ్న ఇది.

 

 

బీజేపీతో పొత్తు ద్వారా పార్టీని ఏపీలో విస్తరించాలను కుంటున్నారా.. లేక.. ఏకంగా జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసిన బీజేపీ ఏపీ శాఖకు ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నారా.. పవన్ వ్యూహం ఏంటి అన్నది మాత్రం అంతుపట్టకుండా ఉంది. గతంలో పవన్ కల్యాణ్ సోదరుడు ప్రజారాజ్యం పార్టీని స్థాపించి.. ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ లో కలిపేశారు. మరి ఇప్పుడు తమ్ముడు బీజేపీలో కలిపేస్తాడా పార్టీని. చూడాలి ఏం జరుగుతుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: