చనిపోయింది ఎవరైనా, సందర్భం ఏదైనా ఎన్ కౌంటర్ ఎప్పుడూ చర్చనీయాంశమే. ఈ పని చేసిన వ్యక్తిని కొందరు హీరో అని మెచ్చుకుంటే, మరికొందరు మానవ హక్కుల్ని మంటగలిపిన వ్యక్తి అని తీవ్రంగా విమర్శిస్తారు. ఎవరేమనుకున్నా కొందరు పోలీసులు మాత్రం మినిమం 50 నుంచి 113 వరకు ఎన్ కౌంటర్లు చేసి స్పెషలిస్టులుగా పేరు తెచ్చుకున్నారు. వీళ్ల ఇన్ స్పిరేషన్ తో ఎన్నోసినిమాలొచ్చాయి.

 

ప్రదీప్ శర్మ దేశంలోనే పాపులర్ ఎన్ కౌంటర్ స్పెషలిస్టు. ఈయన దాదాపు 113 మంది క్రిమినల్స్ ని, టెర్రరిస్టులను పిట్టల్లా కాల్చిచంపినట్లు చెబుతారు. లఖన్ భయ్యా కేసు, గ్యాంగ్ స్టర్ ఛోటా రాజన్ అరెస్ట్​ తరుణంలో ప్రదీప్ శర్మ వార్తల్లోకొచ్చారు. గ్యాంగ్ స్టర్ రామ్ నారా యణ్ గుప్తా ఎన్ కౌంటర్ విషయమై ఈయన్ని కోర్టు సస్పెండ్ చేసింది. 2013లో నిర్దోషిగా బయటపడ్డారు. ఎన్ కౌంటర్లకు అడిక్ట్​ అయ్యానని చెబుతుంటారు ప్రదీప్ శర్మ. 

 

మరో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్. ఈయన 83 ఎన్ కౌంటర్లు చేశారు. దయాని చాలా బాలీవుడ్ యాక్షన్ మూవీలకు ఇన్ స్పిరేషన్ గా చెప్పుకుంటారు. 2007 నాటికి 300లకు పైగా అరెస్టు లు, 83 మందికి పైగా గ్యాంగ్ స్టర్ల ఎన్ కౌంటర్లతో చాలా ఫేమస్ అయ్యారు. అయితే ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అనిపించుకోవటానికి మాత్రం ఇష్టపడరు. 1997లో ఛోటా రాజన్ గ్యాంగ్ తో జరిగిన ఎన్ కౌంటర్లలో రెండు సార్లు గాయపడ్డారు.

 

ప్రఫుల్ భోంస్లే ముంబై పోలీసాఫీసర్. ఈయన ఎన్ కౌంటర్ కౌంట్ ఇప్పటికీ మిస్టరీనే. దాదాపు 90 మంది క్రిమినల్స్ ని చంపారనేది మరో టాక్ . ఛోటా షకీల్ కి ప్రధాన అనుచరుడైన ఆరిఫ్ కలియాని కాల్చిచంపటం ఆయన కెరీర్ లో హైలైట్. 


మరో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సాలస్కర్ కూడా 83 ఎన్ కౌంటర్లు చేశారు. ముంబైలోని భయంకరమైన ముఠాల్లో ఒకటైన అరుణ్ గౌలీ గ్యాంగ్ కి సాలస్కర్ సింహస్వప్నం. తన పాతికేళ్ల సర్వీసులో సుమారు 90 మంది క్రిమినల్స్ ని ఖతం చేసుంటారు. 2008 నవంబర్ 26న ముంబై టెర్రరిస్టు ఎటాక్ లో అజ్మల్ కసబ్ చేతిలో చనిపోయారు. మరణానంతరం ప్రభుత్వం అశోక చక్ర అవార్డు ఇచ్చింది. ముంబై ముంబ్రా ప్రాంతంలో ప్రశాంత వాతావరణం ఏర్పాటులో సచిన్ హిందూరావ్ వాజె కీలక పాత్ర పోషించారు.

                                                                                   
మున్నా నేపాలీ, కృష్ణ శెట్టి అనే కరుడు గట్టిన క్రిమినల్స్ తోపాటు లష్కరే తోయిబా టెర్రరిస్టులను.. మొత్తం మీద 63 మందిని మట్టుబెట్టారు. 1997లో ఆసియాలోనే తొలిసారిగా క్రెడిట్ కార్డ్ స్కామ్ స్టర్లను అరెస్ట్​ చేసిన క్రెడిట్ ఆయనదే. జాబ్ కి రిజైన్ చేసి ప్రస్తుతం శివసేన పార్టీలో ఉన్నారు.

 

థానేలో మాఫియా ఆట కట్టించిన పోలీసాఫీసర్ రవీంద్ర అంగ్రే. ఈయన ఎన్ కౌంటర్ కౌంట్ 51. ఘరానా దోపిడీదార్లకు రవీంద్రంటే గుండె దడ. సురేష్ మంచేకర్ అనే పేరు మోసిన దోపిడీదారుడు రవీంద్ర అంగ్రె ధాటికి తట్టుకోలేక తట్టా బుట్టా సర్దేసుకున్నాడు. ప్రాణభయంతో పారిపోయే ప్రయత్నం చేసినా ఆయన చేతిలోనే అంతం కాక తప్పలేదు. 50ఎన్ కౌంటర్లు పూర్తయ్యాక హాఫ్ సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు రవీంద్ర.   

                                                                    
ప్రస్తుతం ఐజీగా పనిచేస్తున్న అభితాబ్ యశ్ కి యూపీ పోలీస్ డిపార్ట్​మెంట్ లో చాలా గౌరవం ఉంది. ఆయన ఉత్తరప్రదేశ్ లోని ఏ జిల్లాలో పనిచేసినా అక్కడి క్రిమినల్స్ తమంతట తామే లొంగిపోయేవారు. ఆయన చేతిలో చావడం కంటే జైలుకి వెళ్లిపోవడమో, లేదా పారిపోవడమో మంచిదనుకుంటారు. అభితాబ్ యశ్ సర్వీసులో మొత్తం 36 మందిని ఎన్ కౌంటర్ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.

 

ఢిల్లీ పోలీస్ డిపార్ట్​మెంట్ లో కేవలం 13 ఏళ్ల సర్వీసులోనే ఏసీపీగా ప్రమోట్ అయిన ఒకే ఒక ఆఫీసర్ రాజ్ వీర్ సింగ్. 50 మందికి పైగా క్రిమినల్స్ ని కాల్చిచంపి ల్యాండ్ మాఫియాని గజగజ లాడించాడు. కనిపించని నాలుగో సింహం అనిపించుకున్న రాజ్ వీర్ ని క్లోజ్ ఫ్రెండే చంపేశాడు. ఓ ప్రాపర్టీ డీల్ లో ఆయనకు బాకీ పడ్డ ఫ్రెండే రాజ్ వీర్ ను కాల్చిచంపాడు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: