నిర్లక్ష్యమో , నిర్లిప్తతో .. ఈ దేశాన్ని ప్రతీ రోజూ చావులు వెంటాడుతూ ఉన్నాయి.  డిల్లీ లోని అనాజ్ మండి , రాణి ఝాన్సి రోడ్డు లో ఇవాళ ఉదయం జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో దాదాపు ముప్పై ఐదు మందికి పైగా చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు .. 14 మంది చావు బతుకులా మధ్య ఉండగా వారిని లోక్ నాయక్ ఆసుపత్రి కి తరలించారు .

 

 

 

స్పెషల్ డాక్టర్ ల బృందం వారిని పరీక్షిస్తున్నారు , వారిని బతికించే ప్రయత్నం చేస్తున్నారు. ముప్పై మందికి పైగా ఈ ఘటన లో కాపాడగలిగాము అని ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ తెలిపారు. ఫాక్టరీ లో జరిగిన ఈ ఘటన కారణంగా అందులో నిదురిస్తూ ఉన్న కూలీలు , ఇతర చుట్టుపక్కల జనాల మీద ఈ మంట అంటుకోవడం తో తీవ్ర ప్రాణ నష్టం జరిగింది. ప్రస్తుత పరిస్తితి లో ఈ దుర్ఘటన కి కారణాలు తెలియాల్సి ఉంది అని చెబుతున్నారు పోలీసులు.

 

 

 

" రాణి ఝాన్సీ రోడ్డు లో జరిగినది అత్యంత దారుణమైన విషయం .. అక్కడ ఉన్న వారిని కోల్పోయిన వారి కుటుంబాలకి నా ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నాను .. గాయపడినవారి విషయం లో సత్వర చర్యలు తీసుకుంటాం .. ప్రతీ అధికారీ అక్కడ తమ కర్తవ్యం నిర్వహిస్తున్నాడు .. అందరం సహకరిద్దాము " అంటూ మోడి దీని మీద ట్వీట్ చేశారు .

 

 

దగ్గరలోని ఒక బ్యాగ్ తయారీ సంస్థ నుంచి ఈ మంటలు వచ్చాయి అని అధికారులు భావిస్తున్నారు .. తెల్లవారుజామున నాలుగున్నర ఐదు గంటలకి ఈ దుర్ఘటన జరిగింది.. పక్కపక్కనే ఉండే స్మాల్ స్కేల్ దుకాణాలు , తయారీ సంస్థలకి ఈ మంట అంటుకోవడం వలన ఎక్కువ ప్రాణనష్టం జరిగింది .. 

మరింత సమాచారం తెలుసుకోండి: