హైదరాబాద్ షాద్నగర్ లో అమాయకపు వైద్యురాలైన దిశను నలుగురు నిందితులు అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన విషయం తెలిసిందే. దిశా ఘటన ఒక్కసారిగా దేశం మొత్తం వ్యాపించి... దేశం మొత్తం దిశా ఘటనపై స్పందించిన నిరసనలు తెలిపిన తెలిపింది. డిల్లీ లో జరిగిన నిర్భయ ఘటన తర్వాత దేశం మొత్తానికి చేరిన ఘటన ఇదొక్కటే. ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడాలంటు  డిమాండ్ చేసింది దేశ ప్రజానీకం. నిందితులకు ఉరిశిక్ష వేసి మరోసారి ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేయాలి అంటేనే  భయపడాల్సిన పరిస్థితి తేవాలంటూ నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు దిశ కేసులోని నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపారు .

 

 

 

 అయితే దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ పై  దేశవ్యాప్తంగా హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి.  కొంతమంది మాత్రం దిశ కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపడం తప్పు అంటుంటే  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దిశా కేసు  నిందితుల ఎన్కౌంటర్ పై  ఇప్పటికే చాలా మంది సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించి... తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా  తాజాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా  కేసులో నిందితుల ఎన్కౌంటర్ పై  మైసూర్ యువరాజు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త  చామరాజ ఒడయార్... నిందితుల ఎన్కౌంటర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన... ఎన్ కౌంటర్ పై పోలీసు చర్యను  వ్యతిరేకించటం  సరైనది  కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

 

 

 అత్యాచారం హత్య వంటి ఘటనలు ఎవరికీ సంతోషం కాదని... ఆయన హైదరాబాద్ పోలీసులు తీరును సమర్థిస్తూ మాట్లాడారు. హైదరాబాద్ పోలీసులు కూడా అక్కడి పరిస్థితులకు అనుగుణంగానే  వ్యవహరించారని ఆయన అన్నారు. కేసులో నిందితుల ఎన్కౌంటర్ చట్టప్రకారం జరిగితే తప్పు లేదని యువరాజు స్పష్టం చేశారు. నాటి రాజుల కాలానికి నేటి నేటి ప్రజాస్వామ్య కాలానికి చాలా వ్యత్యాసం ఉందని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా దిశా  కేసులో నిందితుల ఎన్కౌంటర్ ను పలువురు తప్పుబడుతుండగా.. కొంతమంది ఆడపిల్లలపై అత్యాచారాలు చేసిన నిందితులకు ఇలాంటి శిక్షలే  విధించాలని అంటూ ఎన్కౌంటర్ ఘటనను సమర్థిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: