దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఉల్లి దిగుబడి ఒక్కసారిగా తగ్గిపోవడంతో పాటు మార్కెట్లో ఉల్లి డిమాండ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఇక ఉలిక్కి డిమాండ్ భారీగా పెరిగిపోవడంతో.. ఉల్లి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటుతున్నాయి. ఏకంగా వందరూపాయల నుంచి 200 రూపాయల వరకు ధరలు  పలుకుతున్నాయి. ఇక ఉల్లి ధరలు సామాన్య ప్రజలను  బెంబేలెత్తిపోతున్నారు. కాస్తో కూస్తో రేట్లు పెరిగితేనే సామాన్య ప్రజలు కూరగాయలను కొనలేని పరిస్థితి ఉంటుంది. ఇక ఇప్పుడు ఉల్లి ధరలు ఏకంగా 100 నుంచి 200 మధ్యలో పలుకుతున్న డంతో సామాన్య ప్రజలకు ఉల్లి భారంగానే మారిపోయింది. దీంతో ఉల్లి ధర చూసి చాలామంది జనాలు జంకుతున్నారు. 

 

 

 

 ఇక ఉల్లి ధర భారీగా పెరిగి కోయకుండానే  ప్రజల కళ్ళలోంచి నీళ్ళు తెప్పిస్తోంది. చాలా మంది ఉల్లిని కొనేందుకు వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకొంత మంది సామాన్య ప్రజలు ఉల్లి ధరలు భారీగా పెరగడంతో తమ రోజువారీ వంటకాలలో ఉల్లి  లేకుండానే వంటలు కానిచ్చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో కూడా ఉల్లి ధరలు భారీగా పెరగడం పై ట్రోల్స్  కూడా ఎక్కువైపోతున్నాయి. ప్రతి విషయాన్ని ఉల్లి ధరలతో కంపేర్  చేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాదండోయ్ అటు  దొంగలు కూడా దొంగతనాలకు వచ్చి మరి నగలు డబ్బు ను వదిలేసి ఉల్లిపాయలను ఎత్తు కెళ్తున్నారు అంటే ఉల్లి ధర ప్రభావం ఎంత ఉందో అర్థమై పోతుంది. ఇప్పుడు దేశం మొత్తం ఉల్లి  టాపిక్ హాట్ టాపిక్ గా మారిపోయింది. 

 

 

 

 అంతేకాదండోయ్ ఇప్పుడు వివాహ శుభకార్యాలకు కూడా ఉల్లిపాయలు బహుమతి గా మారిపోయాయి. కర్నాటకలోని బాగల్కోటే లో జరిగిన ఓ పెళ్లిలో  వరుడు స్నేహితులు ఏకంగా ఉల్లిపాయలను గిఫ్ట్ గా ఇచ్చారు. ఉల్లిపాయలను గంపలో వేసి ఆ నవ దంపతులకు గిఫ్టుగా ఉల్లిపాయలను గంపను అందజేశారు వరుడు స్నేహితులు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అయిపోతున్నాయి. అయితే ఇప్పటికే చాలా చోట్ల వందరూపాయల నుంచి 150 రూపాయల వరకు ఉల్లి ధర పలుకుతుందని అయితే కొన్నిచోట్ల  ఏకంగా 200 కు చేరింది ఉల్లి ధర. కాగా  భారీగా ఉల్లి ధరలు పెరిగి పోవడంతో  ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఉల్లిని అందుబాటులో ఉంచుతూ తక్కువ ధరలకే సబ్సిడీపై అందజేసేందుకు నానా తంటాలు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: