అబ్బా.. రెండు రోజుల నుండి దిశ కేసు నిందితుడి భార్య ఆగటంలేదు కదా.. ఎక్కడ చుసిన ఆమె భర్త ఏదో ఎవరికోసమో ప్రాణాలు వదిలినట్టు మాట్లాడుతుంది.. ఎం అంటే నా భర్త అంటుంది. అసలే ఆ అమ్మాయి వయసు చిన్నది. ఎం మాట్లాడుతుందో తెలీదు.. ఏం చేస్తుందో తెలీదు.. ఎవరో చెప్పిన మాటలు విని అతి పడుతుంది.    

 

ఏంటి ఆమె పరిస్థితి ?ఇంకా అసలు విషయానికి వస్తే.. వెటర్నరీ వైద్యురాలు అయిన దిశను నలుగురు లారీ డ్రైవర్లు కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి పెట్రోల్ పోసి ఆమె శవాన్ని ముట్టుకొనేకి కూడా లేకుండా పెట్రోల్ పోసి కాల్చిపడేసి వెళ్లిన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే.. 

 

ఆ నిందితుల కుటుంబసభ్యులు కాస్త ప్రస్తుతం వార్తల్లో హల్ చల్ చేస్తున్నారు. నిందితుడి తల్లి ఏమో ఉన్న రెండు ఎకరాలను అమ్మి అయినా సరే ఆ కొడుకుని చంపినా పోలీసులను చంపేస్తా అంటుంది.. భార్య ఏమో.. నా మొగుడు పోయాడు 20లక్షలు ఇవ్వండి.. మాకు ఆధారం కావాలి కదా.. వాడు పోతు పోతు నా కడుపులో బిడ్డని వేసి పోయాడు. రేపోమాపో ఆ బిడ్డ కూడా పుడుతుంది. అప్పుడు ఆ బిడ్డను పెంచాలి కదా అంటూ 20 లక్షలు డిమాండ్ చేస్తుంది మీడియా ముందు. 

 

దీంతో నెటిజన్లు అంత .. ఏంటి మీకు అసలు సిగ్గుందా ? ఇలా మాట్లాడుతారు ఏంటి ? ఆడపిల్లకు అన్యాయం జరిగితే... పాశవికంగా హత్యాచారం చేసి చంపేస్తే నువ్వు ఆడపిల్ల అయి ఉండి ఇలా మాట్లాడుతావా ? నీ భర్త ఏమైనా ఎవరికైన న్యాయం చేసి చచ్చాడా ? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. మరి ఈమె అడిగేదానిలో న్యాయం ఉంది అంటారా ? మీరు ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: