దిశ, ఉన్నావో ఘటనలు దేశాన్ని కుదిపేస్తున్నాయి.  ఈ ఘటనలు తరువాత దేశంలో అత్యాచారాలు, హత్యలు తగ్గిపోతాయని అనుకున్నారు.  కానీ, దేశంలో అరాచకాలు తగ్గకపోగా పెరిగిపోతూనే ఉన్నాయి.  ఉన్నవో ఘటనలో బాధితురాలు మరణించిన సంగతి తెలిసిందే.  బాధితురాలు మరణించిన తరువాత నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని నినదిస్తున్నారు.  కానీ, పోలీసులు మాత్రం నిందితులను చట్టప్రకారమే నిందిస్తులను శిక్షిస్తామని అంటున్నారు.  


ఇక ఇదిలా ఉంటె, గతేడాది రేప్ కు గురైన 23 ఏళ్ల యువతిని రాయ్ బరేలి నుంచి తిరిగి వస్తుండగా దుండగులు ఉన్నావో శివారులో తగలబెట్టిన సంగతి తెలిసిందే.  అయితే, ఈ ఘటన తరువాత మరలా ఉన్నావోలోనే ఓ మహిళపై అత్యాచార యత్నం చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నం చేస్తుండగా, మహిళ అక్కడి నుంచి తప్పించుకుంటూ పోలీసులకు ఫోన్ చేసింది.  


తనపై అత్యాచారం చేసేందుకు యత్నం చేస్తున్నారని, రక్షించాలని పోలీసులకు ఫోన్ చేసింది.  అయితే, పోలీసులు చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరిని ఆగ్రహానికి గురయ్యేలా చేసింది.  రేప్ ఇంకా జరగలేదు కదా.. రేప్ జరిగినపుడు  చూద్దాం అని చెప్పడంతో బాధితురాలు ఖంగు తిన్నది.  వెంటనే జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో యూపీ మొత్తం ఆగ్రహంతో రగిలిపోయింది.  యూపీలో ఇప్పటికే అరాచకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 


 ఇప్పుడు ఈ సంఘటన యూపి పోలీసులు చేస్తున్న జరిగిన తరువాత పోలీసులపై మరింత నెగెటివ్ గా ఉన్నారు నెటిజన్లు.  ఇలాంటి ఘటనలు మరలా మరలా పునరావృతం కాకుండా ఉండాలని, పోలీసులకు ఫోన్ చేసినా ఇలా దారుణంగా రెస్పాండ్ అయ్యే  పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  కాగా, ఉన్నావో ఘటన తరువాత పోలీసులపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో పోలీసు అధికారులు ఇలా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే, ఎలాంటి చర్యలు తీసుకుంటారూ అన్నది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: