ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు వేతనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ రేపటిలోపు వేతనాలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మండల పరిషత్ అధికారులు ఉద్యోగుల వివరాలు సేకరించి వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. 

అక్టోబర్ నెల 2వ తేదీన గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులుగా ఎంపికైన వారు విధుల్లో చేరారు. విధుల్లో చేరి రెండు నెలలైనా వేతనాలు అందకపోవటంతో వేతనాల కోసం ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. రేపటిలోగా గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులకు వేతనాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలుస్తుంది. అధికారులు గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగుల పేర్లు, పుట్టిన తేదీ, హోదా, బ్యాంకు ఖాతా వివరాలను సేకరిస్తున్నారు. 
 
అధికారులు సేకరించిన వివరాలను సీఎఫ్‌ఎంఎస్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా పూర్తి స్థాయిలో ఉద్యోగుల నియామకం జరగలేదు. సచివాలయ ఉద్యోగులు విధుల్లో ఎప్పుడు చేరినా అంగీకార పత్రం ఇచ్చిన రోజు నుండి నమోదు చేసి జీతాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
1,26,728 ఉద్యోగాలలో 15,000 ఉద్యోగాలు మిగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. మిగిలిన ఉద్యోగాల వివరాలను అధికారులు ఈ నెలాఖరుకు అందజేస్తారని తెలుస్తోంది. జనవరి నెలలో ప్రభుత్వం మిగిలిన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనుందని తెలుస్తోంది. సీఎం జగన్ ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఉద్యోగాల భర్తీ చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. జనవరి నెలలో మిగతా ఉద్యోగాలతో పాటు గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయని సమాచారం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరుగుతూ ఉండటం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: