ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే ఆ హాయి వేరే అని అన్న ఏంటి రామారావు అన్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఈ పాటను కళ్ళకు కట్టినట్లు ఓ ట్రాఫిక్ కానిస్టేబులు రుజువు చేసాడు. ఆడుతూ పాడుతూ పని చేస్తే ఎంతో హాయి అన్నట్లు ఈ కానిస్టేబుల్ వ్యవహరిస్తుండటం గమనార్హం.. వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ఛత్తీసఘర్ వెలుగులోకి వచ్చింది. ఓ వైపు ఎండ, మరోవైపు దుమ్ము, వాహనాల నుంచి వెలువడే కాలుష్యం. 


ఇలా చూసుకుంటే వీటన్నింటి మధ్యా నిలబడి, ట్రాఫిక్ ను నియంత్రిస్తూ, డ్యాన్స్ చేస్తున్న ఓ కానిస్టేబుల్ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోందిచత్తీస్ గఢ్ లోని యాయ్ పూర్ లోని ఓ చౌరస్తాలో మహ్మద్ మోసిన్ షేక్ అనే కానిస్టేబుల్ కాస్తంత వెరైటీగా ట్రాఫిక్ విధులను నిర్వహిస్తూ రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ వస్తూ పోయే వాహనాలను కంట్రోల్ చేస్తున్నారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 


ఈ విషయం పై స్పందించిన కానిస్టేబుల్ మాట్లాడుతూ.. ఇలా పనిచేస్తూ ఉండటం వల్ల పని సులువుగా ఉందని అన్నారు. గతంలో మధ్యప్రదేశ్ కు చెందిన రంజిత్ అనే కానిస్టేబుల్ చేసిన ట్రాఫిక్ డ్యాన్స్ ను చూసి స్ఫూర్తి పొందానని అన్నారు. ఇక దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందిస్తూ, ఈ పద్ధతిలో ట్రాఫిక్ నియంత్రణ అభినందనీయమని, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, కానిస్టేబుల్ ఫిట్ గా ఉండటంకోసం ఈ విధంగా విధులు నిర్వర్తించడం బాగుందని వ్యాఖ్యానించారు. 

 

ఈ వీడియో చుసిన ఎవరైనా కూడా అతని డ్యూటీ డ్యాన్స్ ను  మెచ్చుకోక మానరు. చాలా మంది ఈ వీడియో చుసిన వాళ్ళు ఏమి టాలెంట్ భయ్యా అంటూ నెటిజన్ల కామెంట్లను అందుకున్నారు. మరికొందరు మాత్రం ఒకటి చేయడమే కష్టం అలాంటిది రెండు చేస్తున్నారు  నిజంగా గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపించారు.  ట్రాఫిక్ కానిస్టేబుల్ మహ్మద్ మోసిన్ ట్రాఫిక్ డ్యాన్స్  వీడియో పై మీరు ఓ లుక్ వేసుకోండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: