దేశంలో రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. నిర్భయ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల్లో  కనీసం మార్పు రావడంలేదు. రేప్ చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపిన కామాంధుల తీరు మారటం లేదు. ఆడపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దీంతో సగటు ఆడపిల్ల రక్షణ లేని ప్రశ్నార్ధక జీవితాన్ని గడుపుతుంది. ఎన్ని కఠిన చట్టాలు వస్తే ఏం లాభం కామాంధుల ఆలోచనకు అడ్డుకట్ట మాత్రం వేయలేక పోతున్నాయి. రోజుకో కొత్త అత్యాచార ఘటన తెరమీదికి వస్తూనే ఉంది. మహిళలకు కనీసం ఎక్కడ రక్షణ లేకుండా అయిపోయింది. అసలు మన దేశంలో మహిళలలుగా  పుట్టడమే తప్ప అంటూ ఆడపిల్లలు బాధ పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 

 

 గతంలో వరంగల్ లో ఇంటర్ విద్యార్థి మానసపై అతి దారుణంగా అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే దీనిపై కొన్ని రోజుల వరకు న్యాయం చేయాలంటూ నిరసనలు కొనసాగినప్పటికీ... ఆ తర్వాత ఈ సంఘటనను అంతా మర్చిపోయారు. అయితే దిశ కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపడంతో... వరంగల్లో మానస రేప్ కేసు కూడా తెరమీదకు తెస్తు మానస కేసులో నిందితులను కూడా  ఎన్కౌంటర్ చేసి చంపాలంటు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా వరంగల్ లో ఎస్సీ ఎస్టీ బిసి మహిళలపై జరిగిన అత్యాచారాల గురించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో మానస తల్లి  తన ఆవేదన వ్యక్తం చేసింది. 

 


 నా బిడ్డను ముగ్గురు కలిసి అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు... తన కూతురు లాగే దిశను అత్యాచారం చేసి చంపేస్తే రోడ్లపైకి వచ్చి ధర్నాలు నిరసనలు చేశారు... మాకు ఎవరు దిక్కు లేక పోవడం వల్లే ఎవరు మద్దతు తెలపడం లేదా. కూతురికి ఇలాంటి ఘటన జరిగితే ఏ తల్లి కైనా కడుపుకోత ఒకటే. దిశ తల్లిదండ్రులకు నిందితులను ఎన్కౌంటర్ చేసి న్యాయం చేసినట్లు నాకు కూడా న్యాయం చేయండి... ఘటన జరిగి ఎన్ని రోజులైనా కూడా ఇప్పుడికి  తన కూతురు అత్యాచార ఘటనకు సంబంధించి న్యాయం జరగలేదు అంటూ ఆమె బోరున విలపించారు. అటు ప్రజలు కూడా మానస కేసులో నిందితులను కూడా ఎన్కౌంటర్ చేసి చంపాలని  డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: