ఏడేళ్ళ క్రితం దేశ రాజధాని ఢిల్లీలో 23 ఏళ్ల నిర్భయపై కీచకులు అఘాయిత్యం చేసారని, వారిని ఇంతవరకు ఉరి తీయలేదని మనకి తెలుసు. ఆ పై ఫొటోలో కనిపించేవాడు ఆ 5గురు నిందితులోని ఒకడు. అతని పేరు వినయ్ శర్మ. అయితే శనివారం రోజు...రాష్ట్రపతికి క్షమాబిక్ష కోసం తాను పెట్టుకున్న పిటిషన్ తనది కాదని... తన ఒప్పందంతో ఆ పిటిషన్ పెట్టలేదని, సంతకం కూడా తీహార్ జైలు అధికారులే పెట్టి, పంపించారని.. అందుకే ఆ పిటిషన్ వాపస్ అన్నాడు.

నిజానికి... ఏడేళ్లుగా ఎంతో మనోవేదన పడిన నిర్భయ తల్లి కూడా వాడి క్షమాబిక్ష పిటిషన్ తిరస్కరించమని, దోషులను త్వరగా ఉరి తీయమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు శుక్రవారం రోజు లేఖ రాసింది. ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కూడా వినయ్ క్షమాబిక్ష పిటిషన్ ను తిరస్కరించి... అదే విషయాన్ని కేంద్రహోంశాఖ కు చెప్పారు. దాంతో నిర్భయ హంతకుడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాలని కేంద్రహోంశాఖ... రామ్‌నాథ్‌ కోవింద్‌కు సిఫార్సు చేసింది. ఈ క్రమంలోనే ఈ వినయ్ శర్మ కూడా ఆ క్షమాబిక్ష పిటిషన్ పైన చెప్పిన విధంగా ఆ పిటిషన్ ఫేక్ అని రాసి... ఆ లేఖను రామ్‌నాథ్‌ కోవింద్‌కు పంపించాడు.

ఎందుకంటే... స్వయంగా రాష్ట్రపతే... అత్యాచార కేసులలో క్షమాభిక్ష సరి కాదని చెప్పాడు. ఇకపోతే... రేపోమాపో క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ చెంతకు చేరుతుంది.. ఆ తర్వాత అతను తప్పనిసరిగా తిరస్కరిస్తారని... దాంతో ఉరిశిక్ష ఖాయమని, చావడం తప్పదని... వినయ్ శర్మ ముందే పసికట్టాడు, కాబట్టి.

తన ఆయుష్షును పెంచుకోవడం కోసం వీలైనన్ని న్యాయ రెమెడీస్ యూజ్ చేసుకొని... తర్వాత సుప్రీమ్ కోర్టులో క్యూరేటివ్ వేసుకుందామని అతని ప్లాన్. సుప్రీమ్ కోర్ట్ వినయ్ క్యూరేటివ్ పిటిషన్ ని రిజెక్ట్ చేసిన... ఇక ఆ ప్రొసీజర్ జరిగేంత వరకైనా తాను బ్రతకొచ్చని... తన చావు తెలివిని వాడుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: