పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అందరికంటే ఆయన పార్టీలో చేరింది ఎవరు అంటే నాదెండ్ల మనోహర్ పేరు కచ్చితంగా వినిపిస్తుంది. జనసేన పార్టీ పుట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కి తోడు నీడగా ఉన్న నాదెండ్ల మనోహర్ ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన జనసేన పార్టీ, ఆ తర్వాత ఇసుక విషయంలో కొద్దిగా హడావిడి చేసింది.

 

అలాగే రాజధాని ప్రాంత రైతుల గురించి కూడా కొన్నిసార్లు మాట్లాడింది అంతే తప్ప మిగతా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని లేదనే చెప్పాలి. ఈ మధ్య వినిపిస్తున్న మాటలు ఏమంటే పవన్ కళ్యాణ్ పార్టీ బాధ్యత మొయ్యలేక బీజేపీ అధిష్టానం ఇచ్చిన ఆఫర్ కి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే గనక జనసేన పార్టీని బిజెపిలో విలీనం చేయాలని పవన్ ఆలోచిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ హోంమంత్రి అమిత్ షా తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

 

సమావేశమైన వెంటనే ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, అతను అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన మాటలు రాజకీయ వర్గాల్లో ఎన్నో చర్చలకు దారి తీసింది. అలాగే తదుపరి ఎన్నికల్లో బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ని ప్రకటించే అవకాశం ఉందని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. జనసేన పార్టీ మొదలైనప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కు తోడునీడగా ఉన్న నాదెండ్ల భాస్కర్ కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారట. ఈయనకి పవన్ బీజేపీతో స్నేహం చేయడం ఏమాత్రం నచ్చలేదట.

 

తనతో మాట వరసకి కూడా చర్చించకుండా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడంపై ఆయన చాలా అలిగాడు అని తెలుస్తుంది. నిజానికి మనోహర్ జనసేన పార్టీకి దూరం అయితే ఆ పార్టీకి చావుదెబ్బ లేదనే చెప్పాలి. జనసేన చేసిన ప్రతి పోరాటంలో ఆయన పవన్ కి తోడు నీడగా ఉన్నారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కూడా ఆయన పవన్ ని వీడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: