వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచార ఘటన రాష్ట్రంలో ఎంతగా ప్రకంపనాలను సృష్టించిందో అందరికి తెలుసు. ఇదే కాకుండా ఆ కామాంధుల ఎన్‌కౌంటర్ కూడా ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తుంది. ఒక చెడు పని చేస్తే ప్రశ్నించడానికి భయడతారు లోకంలో తీరు ఇంతే. కాని ఒక మంచిపని చేస్తే నిందిస్తారు. అప్పుడు మాత్రం అందరి నోళ్లూ తెరుచుకుంటాయి. దిశను చంపిన మృగాళ్ల విషయంలో ఇదే జరుగుతుంది. అన్యాయం జరిగినప్పుడు స్పందించని కొందరు. వారు ఎన్‌కౌంటర్‌లో పోయాక విచారణ అంటూ విరుచుకు పడుతున్నారు.

 

 

ఇకపోతే దిశ హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యుల విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బాధితురాలి తల్లి దండ్రులను కలిసిన సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఏడుగురు సభ్యులున్న బృందం ఎన్‌కౌంటర్‌పై నిజ నిర్ధారణ కోసం శనివారం చేరుకున్న సంగతి తెలిసిందే. మానవ హక్కుల సంఘం సభ్యులు తొలిరోజు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారి మృతదేహాలకు సంబంధించి పోస్టుమార్టం నివేదికను కూడా అధ్యయనం చేశారు. ఈ బృందంలో ఉన్న ఫోరెన్సిక్ మెడిసిన్ నిపుణుడు వీటిని క్షుణ్నంగా పరిశీలించారని శంషాబాద్ డీసీపీ వెల్లడించారు.

 

 

పంచనామా నిబంధనల ప్రకారం జరిగిందా లేదా అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారని వెల్లడించారు. ఇదేకాకుండా మరోవైపు, ఈ ఎన్‌కౌంటర్‌పై ఎంఎల్ శర్మ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో శనివారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దీనిపై సమగ్ర విచారణ చేయాలని పిటిషన్‌లో కోరారు. అంతే కాకుండా ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.20 లక్షల చొప్పున పరిహారం అందించాలని సూచించారు. దిశ కేసులోని నిందితుల విషయంలో ఎలాంటి లోతైన విచారణ లేకుండా పోలీసులు వారు నేరస్థులని నిర్ధరించారని ఆరోపించారు.

 

 

అయితే, ఈ వ్యాజ్యం ఈ వారంలో విచారణకు వచ్చే అవకాశముంది. ఇకపోతే నిందితుల కుటుంబానికి పరిహరం ఇస్తే కనుక సమాజంలో నిందితులకు భయం అనేది లేకుండా పోతుంది అన్నది ప్రజల వాదన. వారెమన్న మంచిపని చేసి మరణించారా చేసిన తప్పుకు ఇంతగా పరిహరం చెల్లించడం న్యాయాన్ని అవమానించినట్లేనని కొందరు అభిప్రాయ పడుతున్నారు.. ఇదే కాకుండా మృగాళ్ల చావుకు 20లక్షల వెలకడితే అన్యాయంగా మరణించిన దిశ మరణానికి ఎంత వెలకడతారంటూ ప్రశ్నిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: