అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్ ప్రభుత్వం, ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంది. దీని కోసం జగన్ కి భారీగా నిధులు అవసరం ఏర్పడుతుంది. మరో వైపు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళు రావడం లేదు. అలాగే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యంపై కూడా జగన్ ఉక్కుపాదం మోపారు. దీంతో నిధుల కొరత చాలా తీవ్రంగా ప్రభుత్వంపై ఉంది.

 

అయితే జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన నవరత్నాలు అమలు చేయడానికి కంకణం కట్టుకున్నట్లు తెలిసింది. ఆ ఉద్దేశంతోనే తల్లిదండ్రులకే అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం ప్రతి తల్లికి తన బిడ్డను బడికి పంపినందుకు ఏటా 15 వేల రూపాయలు ఇవ్వడానికి హామీ ఇచ్చారు.

 

 కానీ ఈ పథకానికి భారీగా నిధులు అవసరం ఉంటుంది. దాని సమకూర్చే పనిలో  నిమగ్నమైంది. తాజాగా ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని 15 వేల కోట్ల రూపాయలు రుణాలు అందించాలని ఈ ప్రభుత్వం కోరింది. ఒకవేళ కేంద్రం కనుక కరుణిస్తే అమ్మ ఒడి పథకానికి రుణాలు తీసుకుని పథకం అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ 33 వేల 617 కోట్ల అప్పు చేసింది. ఒక్క నవంబర్ నెలలోనే ఏకంగా 8510 కోట్ల తప్పుఅసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్ ప్రభుత్వం, ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంది. దీని కోసం జగన్ కి భారీగా నిధులు అవసరం ఏర్పడుతుంది. మరో వైపు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళు రావడం లేదు. అలాగే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యంపై కూడా జగన్ ఉక్కుపాదం మోపారు. దీంతో నిధుల కొరత చాలా తీవ్రంగా ప్రభుత్వంపై ఉంది.లు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉండటంతో మరో 3 వేల కోట్లు రుణం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కానీ ఆ నిధులు అమ్మఒడి పథకం అంటే సరిపోదు.

 

కానీ ఇప్పటికే ఆర్థికమాంద్యంతో ఇబ్బంది పడుతున్న కేంద్ర సర్కారు ఈ విషయంలో అంతగా సానుకూలంగా లేదని తెలుస్తోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ఏం చేస్తాడో చూడాలి. ఒక వేళ కేంద్రం కరుణ చూపించకపోతే రాబోయే నెలల్లో జీతాలు, పెన్షన్లు, పథకాల అమలు చేయడం ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: