గత పది రోజులుగా తెలంగాణ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన దిశ అత్యాచార హత్య కేసులో ఎన్నో మలుపులు తిరిగాయి. చివరికి నిందితులుగా అనుమానపడే నలుగురు రెండు రోజుల క్రితం పోలీస్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ హైదరాబాద్ పోలీసులకు ఒక కొత్త సమస్య ఎదురవుతోంది . చాలా మంది ఈ ఇటువంటి న్యాయం దిశకు జరగడంతో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు.

 

 కానీ వారిలో కూడా ఇలాంటి ఓ సంఘటన ఒకటి జరుగుతుందని అసలు అనుకోలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను హతమార్చడం ఒక రకంగా సరైన అంటున్నారు . కానీ కొందరు శాంతిభద్రతలు అదుపులో ఉంచవలసిన పోలీసులు ఎందుకు ఈ పద్ధతిని  ఆశ్రయించాలని ప్రశ్నిస్తున్నారు. చాలా మంది కూడా ఎన్ కౌంటర్ లో దళితులు, ఆదివాసులు, ముస్లింలు ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేసారు. అసలు చట్ట ప్రకారం వెళితే ఇలాంటి పనులు చేసిన పోలీసులుకు కూడా శిక్ష వేసే అధికారం కోర్టులకు ఉంటుంది. ఐపిసి 337 ,331 ప్రకారం దోషుల్ని హింసిస్తే పోలీసులకు కూడా 7 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఇంతకముందు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు ఎం జరిగిందో చూద్దాం.

 


తమిళనాడుకు చెందిన 20 మందిని ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు 2015లో వారిని కాల్చిచంపారు. నమ్మడానికి అంత ఈజీగా లేకపోవటంతో దీనిపై తమిళనాడు ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై జాతీయ మానవహక్కుల సంఘం విచారణ చేపట్టింది. కమిషన్ దీనిపై ఇచ్చిన నివేదికలో పోలీసుల చర్యను విమర్శించిందే కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫారసు చేయలేదు. ఈ కేసు ఏపీ హైకోర్టులో ఇంకా పెండింగులో ఉంది.

 


ముంబయిలో ఒక వ్యక్తి పోలీసు కస్టడీలో మరణించడంపై 'యశ్వంత్ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం' కేసులో 2018లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. నిర్దోషి అని తెలిసినా పోలీసులు ఒక వ్యక్తిని ఓ కేసులో తీసుకెళ్లి హింసించి, కొట్టడంతో పోలీస్ కస్టడీలోనే చనిపోయాడు. ఈ కేసులో ఆ స్టేషన్లోని పోలీసులనందరినీ కింది కోర్టు వేసిన మూడేళ్ల శిక్షను ఏడేళ్లకు పెంచింది. అలాంటి కేసుల్లో పోలీసులు ఏమీ మినహాయింపు కాదన్న సందేశాన్ని ఇచ్చింది  దేశ అతునైతే న్యాయస్థానం.

మరింత సమాచారం తెలుసుకోండి: