ఐదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. స‌మ‌స్య‌లు తెలిసిన పార్టీ. ఆర్థికంగా రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న‌దో తెలిసిన పార్టీ ఇలా అన్నీ తెలిసి.. కూడా టీడీపీ ఉద్య‌మానికి సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఇసుక కొర త‌పై  ఉద్య‌మించి భారీ ఎత్తున ధ‌ర్మాలు, నిర‌స‌న‌లు చేసి ఈ  విష‌యంలో ఫెయిలైంది. అయినా కూడా ఇ ప్పుడు ఆర్టీసీని భుజాన వేసుకుంటోంది. తాజాగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం ఆర్టీసి బ‌స్సు చార్జీల‌ను అత్యంత స్వ ల్పంగా పెంచింది. సిటీ, ప‌ల్లెవెలుగు బ‌స్సులకు కిలోమీట‌ర‌కు 10 పైస‌లు, మిగిలిన రూట్ల‌కు 20 పైస‌లు వంతున పెంచింది. ఇది త‌ప్ప‌నిస‌రి ప‌రిస్తితిలో తీసుకున్న నిర్ణ‌యంగా కూడా ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.



నిజానికి డీజిల్ ధ‌ర‌ల నుంచి విడిభాగాల వ‌ర‌కు కూడా అనేక రూపాల్లో ఆర్టీసీ న‌ష్టాల‌ను భ‌రిస్తోంది. రోజుకు కోట్ల రూపాయ‌ల్లో సంస్థ న‌ష్టాలు కొని తెచ్చుకుంటోంది. ఈ నేప‌థ్యంలో కొంత ఊపిరి అందేందుకు ఆర్టీసికి చార్జీలు పెంచ‌క త‌ప్ప‌ద‌నే విష‌యాన్ని అనేక మంది అంగీక‌రిస్తున్న విష‌యం. ఇక‌, ఆర్టీసిని ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌డంలోనూ జ‌గ‌న్ ముంద‌డుగు వేశారు. దీంతో ఈ సంస్థ ఉద్యోగుల‌కు జీతాల పెంపు కూడా ఖాయం ఈ ప‌రిస్థితిలో చార్జీల‌ను పెంచాల్సి వ‌చ్చింద‌నేది నిజం. అయితే, ప్ర‌తిప‌క్ష టీడీపీ మాత్రం జ‌గ‌న్ ఏం చేసినా.. దానిని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.



ఈ క్ర‌మంలోనే తాజాగా ఆర్టీసీ బ‌స్సు చార్జీల పెంపు ను కూడా టీడీపీ త‌మ‌కు అనుకూలంగా మార్చుకుం ది. ఇప్ప‌టికే మాజీ మంత్రి టీడీపీ అధికార ప్ర‌తినిధి దేవినేని ఉమా మీడియాముందుకు వ‌చ్చి.. శోక‌ణ్ణాలు పెట్టేశారు. అయితే, గ‌తంలో చంద్ర‌బాబు కూడా అధికారంలోకి వ‌చ్చిన తొలి ఏడాది ఆరు మాసాల్లోనే ఆర్టీసీ క‌నీస చార్జీని రూ.5కు పెంచిన విష‌యాన్ని విస్మ‌రించ‌డ‌మే ఇప్పుడు వ‌చ్చిన చిక్క‌ల్లా. పైగా ఆ నాటి నుంచి డిమాండ్‌గా ఉన్న ఆర్టీసీ విలీన ప్ర‌తిపాద‌న‌ను ప‌క్క‌న పెట్టిన చంద్ర‌బాబు క‌న్నా జ‌గ‌న్ దూకుడుగా వ్య‌వ‌హ‌రించి ఆర్టీసిని ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌ని నిర్ణ‌యించారు. మ‌రో మూడు వారాల్లో ఈ ప్ర‌క్రియ పూర్తి కానుంది.


ఇదిలావుంటే, ప‌క్క రాష్ట్రం తెలంగాణ‌లోనూ చ‌క్రం తిప్పుతున్న టీడీపీ.. అక్క‌డి సీఎం కేసీఆర్ ఇంత క‌న్నా ఎక్కువ‌గానే ఆర్టీసీ చార్జీల‌ను ఇటీవ‌ల పెంచారు. మ‌రి అప్పుడు టీడీపీ ఎందుకు స్పందించ‌లేదో.. చెప్పాలి. అంటే తెలంగాణ‌లో పార్టీ అధికారంలోకి అయితే రావాలి. త‌మ అభ్యర్తుల‌కు ప్ర‌జ‌లు ఓట్లు వేయాలి. కానీ, అక్క‌డ మాత్రం ధ‌ర‌లు పెంచితే కిక్కురు మ‌నే ప‌రిస్థితి మాత్రం ఉండ‌దు. ఇదేం నీతి బాబూ.. అంటున్నారు విశ్లేష‌కులు ఇలాంటి ప‌రిస్థితిలో టీడీపీ పుంజుకోవ‌డం ప‌క్క‌న పెడితే.. ఇబ్బందేన‌ని అంటున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా బాబు టీం సంయ‌మ‌నం పాటిస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: