భారత దేశ క్రికెట్లో ఒక గొప్ప కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు సౌరవ్ గంగూలీ. తన ఆటతోనే కాదు తన ఆవేశం తో కూడా మాయ చేయగలిగిన వ్యక్తి గంగూలీ. అప్పటి తరం క్రికెటర్లలో ఉత్సాహం నింపడానికి ఎంతగానో ప్రయత్నం చేసేవాడు. అసలు మన జట్టు విదేశాలలో ఎలా గెలవాలో ఎలా ఆడాలో నేర్పించిన వ్యక్తి గంగూలీ.  అలాంటి గంగూలీ ఇప్పుడు బీసీసీఐ చీఫ్ సారభ్ గంగూలీగా మారాడు. ఎవరో ఏదో అనుకుంటారని తగ్గటం అతనికి అస్సలు తెలియదు. 

 

బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎంత పవర్ ఫుల్ అన్నది ప్రతేకంగా  చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి అమిత్ షా కొడుకు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు భయపడకుండా తాను చెప్పాల్సింది చెప్పేయటం ద్వారా తనను అందరూ ‘దాదా’ అని ఎందుకు పిలుస్తారో నిరూపించాడు. గంగూలీ మాట్లాడుతూ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా ఉండటం వల్లే ఆయన కుమారుడు జే షా బీసీసీఐలోని కీలక పదవిలో ఉన్నట్లు వస్తున్న విమర్శల్ని గంగూలీ సింఫుల్ గా కొట్టిపారేశాడు. ప్రముఖ వ్యక్తులు బోర్డులో ఉండటం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదన్న ఆయన ఇంటి పేర్లు చూసి మాట్లాడటం సరికాదన్నారు.

 

అసలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొడుకు జే షా బీసీసీఐ కార్యదర్శి గా పదవిని చేపడితే వచ్చే నష్టం ఏమిటి అని ప్రశ్నించాడు ఆయన గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ లో గత ఆరు సంవత్సరాలుగా పని చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ప్రజలు ఎవరైనా రాజకీయ నాయకులు వారి కొడుకు కూతురు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండకూడదని కచ్చితంగా భావిస్తున్నారు ఈ కాలంలో. ఏది ఏమైనా సౌరవ్ గంగూలీ తన పద్ధతిని ఇంకా మార్చుకోలేదని తెలుస్తుంది. అదే దూకుడు అదే పనితీరు కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: