మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే, అయినా   ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి .. నెల్లూరు జిల్లాలో మాఫియా రాజ్యం అంటూ ఆయన అమండిపడ్డాడు.. మాఫియాలు, కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు జిల్లాలో ఎక్కువ అయిపోయారని .. లిక్కర్, బెట్టింగ్, లాండ్, శాండ్, ఏ మాఫియా కావాలన్నా  ఇలా ఎవరు కావాలన్నా వాళ్ళు నెల్లూరు వస్తే దొరుకుతారు అంటూ ఆనం వ్యాఖ్యానించారు..

 

కొంతమంది మాఫియా గ్యాంగ్‌లు, గ్యాంగ్‌స్టర్‌లకు నెల్లూరును అప్పగించారని బయటకు చెప్పుకోలేక ప్రజలు బాధ పడుతున్నారని అయన అన్నారు . దీనిపై పెద్ద దుమారం రేగింది. జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ మీద బెట్టింగ్ కేసులు ఉన్నాయి. శ్రీధర్ రెడ్డి ఇటీవల ఓ మహిళా అధికారితో దురుసుగా ప్రవర్తించారు. మీడియా వారిని కూడా బెదిరిస్తున్నారనే ఆరోపణలు వారిఫై  ఉన్నాయి.

 

వీటికి సంబంధించిన కాల్ రికార్డులుకూడా  సోషల్ మీడియాలో బాగానే   ప్రచారం అయ్యాయి. వారిని గురించ్స్హే ఆనం వాక్యాలు చేసారంటూ గుసగుసలాడుతున్నారు. . అయితే, అసలు వారిద్దరినీ ఆనం టార్గెట్ చేయడం వెనుక చాలా కథ ఉంది అంటున్నారు  నెల్లూరు  రాజకీయ నాయకులు 
నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి రాజా ఇన్‌స్టిట్యూషన్స్‌‌ను ఆనం రామనారాయణరెడ్డి కుటుంబం నిర్వహిస్తోంది.

 

దీంతోపాటు వేణుగోపాల స్వామి ఆలయ భూముల కు సంబందించిన అంశాలను  కూడా ఆనం కుటుంబంమే చూస్తోంది. అయితే, తాజాగా వెంకటగిరి రాజా ఇన్‌స్టిట్యూషన్స్‌‌లో అభివృద్ధి కమిటీని నియమించారు. ఆ కమిటీ బాధ్యతలు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి అప్పగించారు. దీంతో అప్పటి వరకు తమ చేతుల మీదుగా నడిచిన వీఆర్ ఇన్‌స్టిట్యూషన్స్ తమ చేజారి పోతాయి అన్న భయం పట్టుకుంది ..

 

ఆనంకు. దీంతోపాటు వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించి ఇన్‌చార్జి ఈవోగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి.రవీంద్రా రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మంత్రి అనిల్ కుమార్ ఆదేశాలతోనే ఆయన ఈ బాధ్యతలు తీసుకున్నట్టు తెలుస్తోంది.జిల్లాకు సంబంధించిన అంశాలపై జగన్‌ను కలిసేందుకు ఆనం రామనారాయణరెడ్డి ప్రయత్నించారని, అయితే, సీఎం అపాయింట్‌మెంట్ దొరకలేదని సమాచారం. ఈ క్రమంలో మీడియా ముందే పరోక్షంగా తన ఆగ్రహం మొత్తం వెళ్లగక్కారు ఆనం. 

మరింత సమాచారం తెలుసుకోండి: