ఒక ప్రభుత్వ పథకం అమలవుతోంది అంటే కచ్చితంగా అందులో నాయకుల,మంత్రుల  ఫోటోలు ఉండడం సహజం అయిపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలపై కేవలం ప్రధాన మంత్రి ఫోటో, అలాగే రాష్ట్ర సీఎం ఫోటో మాత్రమే ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విషయంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కొనసాగుతున్న పథకాలపై ప్రచారం చేసేటప్పుడు కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి.

 

ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాల పై ఉన్న మంత్రుల ఫొటోలు ఇక నుంచి కనిపించకపోవచ్చు. ప్రభుత్వం యంత్రాంగం ద్వారా కొనసాగుతున్న పథకాలపై ఇక నుంచి కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ ఫోటోలు మాత్రమే కనిపిస్తాయి. ఇందుకు సంబంధించిన ఆదేశాలను సీఎం ఆఫీస్ తగిన అధికారులకు జారీ చేశారు. రాష్ట్ర పథకాలలో ఇక నుండి ఆయా శాఖల మంత్రులు ఫోటోలు ఉండకూడదని కేవలం సీఎం ఫోటోలు మాత్రమే ఉపయోగించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రింట్ మీడియా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఈ విధంగా తెలిపారు.

 

ఈ ఆదేశాలు ఇంతకు ముందే ఉన్నా కూడా గత ప్రభుత్వం ఈ ఆదేశాలను పట్టించుకోలేదని చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కూడా ఇదే పద్ధతి కొనసాగుతుందని అందరూ భావించారు. కానీ సీఎం జగన్ ఇప్పుడు ఈ ఆదేశాలను జారీ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇదిలా ఉంటే నిన్న జగన్ గారు తన ఢిల్లీ పర్యటనను మధ్యలోనే ముగించుకొని రావాల్సి వచ్చింది. అమీషా అపాయింట్మెంట్ కోసం దాదాపు ఐదు గంటలు ఎదురు చూసిన జగన్ కి  చివరికి నిరాశే మిగిలింది.

 

కాగా మూడు రోజుల పాటు సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23,24,25 తేదీల్లో జగన్ పర్యటన ఉంటుంది. పర్యటనలో భాగంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: