తెలుగుదేశం పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ? అనే ప్రశ్న ఆ పార్టీని ఏళ్ళ తరబడి మోస్తున్న వాళ్ళలో కూడా వినపడుతుంది. ఎంతో బలంగా ఉన్నామని, ఎన్నికల్లో విజయం సాధిస్తామని భావించిన తెలుగుదేశం ఊహించని విధంగా జగన్ చేతిలో ఓటమి పాలైంది. చంద్రబాబు మీద ఎక్కువ ఆశలు పెట్టుకుని తెలుగు తమ్ముళ్ళు బొక్క బోర్లా పడ్డారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత ఎన్నో ఇబ్బందులు పడుతూ వస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే. 

 

దీంతో ఆ పార్టీ నేతల్లో పార్టీ భవిష్యత్తుపై అనేక ఆందోళనలు, పెట్టుబడి పెట్టిన వాళ్ళు, ఇన్నాళ్ళు పార్టీని మోసిన వాళ్ళు, కార్యకర్తలకు ఇబ్బందులు వచ్చినా, ఏది వచ్చినా సరే అండగా నిలబడిన వాళ్ళు అందరూ కూడా... పార్టీకి ఇప్పుడు దూరం జరిగే ఆలోచనలో ఉన్నారు. కృష్ణా జిల్లాలో చంద్రబాబుకి అత్యంత నమ్మకస్తుడు ఆ నేత... ఆయన కోసం చంద్రబాబు కొందరిని పక్కన పెట్టారు. 

 

అయితే ఇప్పుడు ఆయన బిజెపి వైపు చూస్తున్నారు. తనకు తెలుగుదేశం మీద నమ్మకం లేదని చంద్రబాబుకి కూడా ఆయన స్పష్టంగా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి, జగన్ కూడా క్రమంగా బలపడే అవకాశం ఉందని, ఇప్పుడు పార్టీ మారితేనే తనకు భవిష్యత్తు ఉంటుంది అని ఆయన భావిస్తున్నారట. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు మాజీలు, నెల్లూరు కి చెందిన మాజీలు, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి... ఎవరి దారి వాళ్ళు చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. 

 

ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఒక మాజీ మంత్రి గారు కూడా పార్టీ మారితేనే మంచిది అని భావిస్తున్నారని సమాచారం. ఇక ఇద్దరు మాజీ ఎంపీలు బిజెపి ఎంపీలను కలిసి మాట్లాడారని, తమకు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు కావాలని... తమకంటూ వర్గాలు ఉన్నాయని చెప్తున్నారట.  ఏదేమైనా టీడీపీ మాజీలు భారీ ఎత్తున పార్టీ వీడితో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీని ముందుండి న‌డిపించే నాయ‌కుడే లేని ప‌రిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: