జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైసీపీ ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలే చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఆయన ఇంకా డోస్ పెంచి మరీ ఆరోపణలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వ విధానాలు తనకు నచ్చడం లేదని, ముఖ్యమంత్రి జగన్ ని తాను ముఖ్యమంత్రి గా గుర్తించేది లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆయన బిజెపిని తెలుగుదేశం పార్టీని ఎక్కువగా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలతో సీనియర్ నేతలతో ఎక్కువగా సావాసం చేస్తున్నారు.

 

అసలు ఇప్పుడు ఆయన ఈ స్థాయిలో చెలరేగిపోవడానికి కారణం ఢిల్లీలో ఉన్న కొందరు వ్యక్తులే అంటున్నారు. వారిలో చంద్రబాబు సన్నిహిత రాజ్యసభ ఎంపీ ఒకరు ఉన్నారని అంటున్నారు. పవన్ ని ఒక పెద్ద దగ్గరకు తీసుకువెళ్ళి రాష్ట్రంలో పలానా సమస్యలు ఉన్నాయని పవన్ తో నివేదిక ఇప్పించి... కొన్ని ఊహాగానాలను ఆయనకు వివరించి... ఇది అండి పరిస్థితి అని చెప్పారట. దీనికి బదులు ఇచ్చిన కేంద్ర మంత్రి గారు... వాటిని లక్ష్యంగా చేసుకునే మీరు విమర్శలు చేయమని పవన్ కి సూచించినట్టు తెలుస్తుంది.

 

భవిష్యత్తులో జనసేనాను తమలో కలుపుకునే అవకాశం ఉందని మీరు ప్రభుత్వాన్ని విమర్శించమని సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుకే పవన్ ఈ విధంగా విమర్శలు చేస్తున్నారట. ఇక భవిష్యత్తులో ఆయన మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని, రహస్యంగా చంద్రబాబుకి సహకరిస్తూ వైసీపీ ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. 

 

ఇక సోషల్ మీడియాలో కూడా పవన్ అండ్ గ్యాంగ్ ఎక్కువగా వైసీపీ ప్రభుత్వంపై కొన్ని తప్పుడు ప్రచారాలకు కూడా పూనుకునే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఇవి జరిగే అవకాశం ఉందని అంటున్నారు. కొద్ది రోజులుగా జ‌రుగుతోన్న ప‌రిణామాలు కూడా ప‌వ‌న్ కేవ‌లం వైసీపీనే టార్గెట్ గా చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తున్నాయి. ఇక అటు వైసీపీ కూడా ప‌వ‌న్ త‌మ‌ను టార్గెట్ చేస్తున్న విష‌యం గ్ర‌హించి అదిరిపోయే కౌంట‌ర్లు ఇస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: