కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ గతం ఎంతో ఘనం. రాజకీయంగా ఈ జిల్లాలో పార్టీ ఒక వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. రాజకీయంగా ఎన్నో విజయాలు ఈ జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ సాధించింది. రాజకీయంగా ఎన్టీఆర్ కి, చంద్రబాబుకి జిల్లా నుంచి మంచి సహకారం అందింది. అయితే ఇప్పుడు మాత్రం కావాల్సిన స్థాయిలో పార్టీకి సహకారం అందడం లేదనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. నమ్మకం గా ఉన్న వాళ్ళు వర్గాలు తయారు చేయడం, నమ్మిన వాళ్ళు మోసపోవడం వంటివి పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి అనేది వాస్తవం.

 

జిల్లాలో దేవినేని ఉమా కారణంగా చాలా నష్టం జరిగింది. ఆయన వలన రెండు మూడు నియోజకవర్గాల్లో స్థానిక నాయకత్వం, బలమైన కార్యకర్తలు పార్టీకి దూరం జరిగారు. ఎన్నికల తర్వాత పార్టీ జిల్లాలో దారుణంగా ఓడిపోయింది. దీనితో... బలమైన నేతలు గా ఉన్న వారు దూరమయ్యారు. దేవినేని నెహ్రు తనయుడు దేవినేని అవినాష్ కి జిల్లాలో మంచి బలం ఉంది. జిల్లా వ్యాప్తంగా దేవినేని అభిమానులు ఉన్నారు. 

 

వారందరూ కూడా ఇప్పుడు అవినాష్ తో పాటు పార్టీ మారిపోయారు. ముందు వెళ్లకపోయినా తర్వాత మాత్రం వెళ్ళిపోయారు. ఇక కేశినేని నాని, దేవినేని ఉమా మధ్య విభేదాలు కూడా క్యాడర్ ని ఇబ్బంది పెట్టాయి. గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి వంశీ పార్టీని వీడారు. దీనితో నియోజకవర్గంలో కూడా క్యాడర్ భారీగా పార్టీ మారే అవకాశం ఉందని అంటున్నారు. విజయవాడ నగరంలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో ఒక్క తూర్పు లో మినహా రెండు నియోజకవర్గాల్లో పార్టీ బలహీనపడింది. 

 

పెనమలూరు, బందరు, గుడివాడ, పామర్రు నియోజకవర్గాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అవనిగడ్డ, పెదనలో కూడా కార్యకర్తలు జెండా వదిలేసారని ఇటీవల ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇక తిరువూరు లాంటి చోట్ల కూడా పార్టీ ప‌రిస్థితి ఘోరంగా ఉంది. ఇక్క‌డ పోటీ చేసిన మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్ తిరిగి కొవ్వూరు వైపు చూస్తుండ‌డంతో తిరువూరులోనూ పార్టీని ప‌ట్టించుకునే వాళ్లే లేరు. ఏదేమైనా కంచుకోట‌లో టీడీపీకి జెంగా ప‌ట్టు నాథుడే లేకుండా పోతున్నాడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: