మమ్మల్ని కనీసం అధికారులు లెక్క చెయ్యడం లేదు, మాకు మా నియోజకవర్గాల్లో కనీసం విలువ ఉండటం లేదు. మేము వస్తుంటే మాకు సమాచారం ఉండటం లేదు, ప్రోటో కాల్ పాటించే దిక్కు ఉండటం లేదు, ఓడిపోయిన అభ్యర్ధులే ఇక్కడ పెత్తనం చేలాయిస్తున్నారు. పార్టీలో ఒకప్పుడు ఉన్న వాళ్ళే ఇప్పుడు అధికార పార్టీకి సహకరిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. రాజకీయంగా మేము ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము ఇలాగే ఉంటే నిలబడే పరిస్థితి లేదు. 

 

బిజెపిలోకి గాని వైసీపీలోకి గాని వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నాం. మీకు చెప్పినా ఫలితం ఉండటం లేదు, మేము ఎక్కువ కాలం ఈ నరకం భరించలేం... మా వల్ల కావడం లేదు, దయచేసి అర్ధం చేసుకోండి.. చంద్రబాబు ముందు రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక‌ ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు వాపోతూ బయటపెట్టిన బాధ అది. అవును అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు పెట్టిన ఇబ్బందులతో అధికారులు ఇప్పుడు అవసరమైన దూరం పాటిస్తున్నారు. 

 

గతంలో అధికారం ఉందని తమ మీద అనవసరం పెత్తనం చెలాయించిన వీరి విషయంలో అధికారులు ఆగ్రహంగా ఉన్నారు. ఏ అధికారిక కార్యక్రమం కి సంబంధించిన సమాచారమూ వీరికి ఇవ్వడం లేదు. వీరిలో అనంతపురం ఎమ్మెల్యే ఒకరు ఉన్నారని అంటున్నారు. ప్రకాశం జిల్లాలో అయితే సదరు నేత ఎమ్మెల్యే పదవి లేకుండానే తమను ఇబ్బంది పెట్టారు. దీనితో ఇప్పుడు ఆయన గారితో దూరం పాటిస్తున్నారు అధికారులు. 

 

ఇక ఎన్నికలకు ముందు కొందరు వైసీపీలో జాయిన్ అయ్యారు. వారు కూడా వీరి బాధితులే... దీనితో ఇప్పుడు తెలుగు దేశం ఎమ్మెల్యేలకు అధికారులు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చుక్కలు చూపిస్తున్నారు. ఏదేమైనా పార్టీలో ఉండ‌లేమ‌ని ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు నేరుగా బాబుకే చెప్పారంటే ఇక వాళ్లు పార్టీలో ఉంటార‌ని ఆశించ‌డం అత్యాశే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: