ఉరగాయి.. ఎప్పుడు మనకు అందుబాటులో ఉండే.. పరమాన్నం నుండి పెరుగు అన్నం వరుకు ప్రతిచోటా తినే ఉరగాయి. ఎన్నో రకాల ఉరగాయి చేసుకుంటూ ఉంటాం. మామిడి కాయ, టమోటో, పచ్చిమిర్చి, ఉసిరికాయ, పండుకారం ఇలా ఎన్నో రకాల ఉరగాయిలు మనం చేసుకుంటూ ఉంటాం. అందులో ఒకటే దొండకాయ ఉరగాయి. ఈ దొండకాయ ఉరగాయి ఎలా చేసుకోవాలో చాలామందికి తెలియదు.. అయితే ఆ ఉరగాయి ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి.  

 

కావాల్సిన పదార్థాలు... 

 

దొండకాయలు - పావుకిలో, 

 

ఆవపిండి - 100గ్రాములు, 

 

కారం - 100గ్రాములు, 

 

ఉప్పు - 100గ్రాములు, 

 

నువ్వల నూనె - పావుకిలో,

 

పసుపు - అర టీ స్పూను, 

 

ఇంగువ - చిటికెడు, 

 

మెంతిపిండి - ఒక టీ స్పూను, 

 

చింతపండు - 50గ్రాములు 

 

నిమ్మకాయలు(పెద్దవి) - రెండు.

 

తయారీ విధానం... 

 

ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడిగి పొడిబట్టతో తుడిచి ఆరబెట్టుకోవాలి. ఆరిన తరువాత కాయలకి చిన్న పుల్లతో గాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా నూనెపోసి అందులో ఈ దొండకాయల్ని వేసి స్టౌమీద పెట్టాలి. ఈ గిన్నెపై మరో వెడల్పాటి గిన్నెపెట్టి అందులో నీళ్లుపోయాలి. ఇప్పుడు దీన్ని చిన్నమంటపై మగ్గనివ్వాలి. కాయలు మెత్తపడ్డాక దించేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు, మెంతిపిండి, పసుపు వేసి బాగా కలుపుకుని పెట్టుకోవాలి. ఉడికిన దొండకాయలపై నిమ్మరసం వేసి బాగా కలిపి ఆవపిండిలో వేసి కలుపుకోవాలి. మిగిలిన నూనెని వేడిచేసి అందులో ఇంగువ వేసి దొండకాయలపై పోయాలి. ఆవపిండి కాయలకు పట్టేలా బాగా కలుపుకుని ఒక గాజుసీసాలో భద్రపరుచుకోవాలి. మూడవ రోజున తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ దొండకాయల ఆవకాయ నెలరోజుల వరకూ పాడవకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: