దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతం ప్రజల మనసులను కదిలించింది. అంతకంటే ఎక్కువగా దిశ నిందితుల ఎన్ కౌంటర్ ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. మహిళల రక్షణే ప్రశ్నార్ధకమైన నేపథ్యంలో.. పోలీసుల పనితీరు పైనే అనుమానాలు వస్తున్న వేళ.. సూర్యుడు కూడా ఉదయించకముందే నిందితులు పోలీసు ఎన్ కౌంటర్లో మృతి చెందారు. ఈ దారుణ ఉదంతంపై స్పందించని వారు లేరు. యావద్భారతం మొత్తం నిందితులను ఉరి తీయాలని గొంతెత్తి ఘోషించింది. ఈ దారుణ రాక్షసకాండ, ఎన్ కౌంటర్ పై ప్రముఖ సినీ నటి నయనతార స్పందించారు.

 

 

ఓ అమాయకురాలిని నిస్సహరాయులిని చేసి అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితులను అంతే దారుణంగా చంపినా తప్పేం లేదు. న్యాయం కోసం జరుగుతున్న పోరాటంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న పోలీసులు అభినందనీయులు. వారికి నా హ్యాట్సాఫ్. ఏ రైట్ యాక్ట్ ఆఫ్ హ్యూమనిటీ గా ఇది నా అభిప్రాయం. ప్రతి మహిళ ఈ రోజును, జరిగిన న్యాయాన్ని గుర్తు పెట్టుకోవాలి అంటూ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలిపింది. న్యాయం అనేది సత్వరం జరిగితేనే ఆ పదానికి న్యాయం చేసినట్టుఅని కూడా తెలపింది. ఓ పక్క నిందితుల ఎన్ కౌంటర్ పై హ్యూమన్ రైట్స్ వ్యతిరేకిస్తుంటే నయనతార ఇలా స్పందించటం చర్చనీయాంశమైంది.

 

 

మహిళల రక్షణలో ప్రపంచ యువనికపై భారత్ ఉనికినే ప్రశ్నార్ధకం చేసిన ఈ సంఘటన భారత్ ను కుదిపేసింది. నిర్భయ ఘటన తర్వాత అంతటి తీవ్ర సంచలనం సృష్టించిన ఘటనగా నిలిచిపోయింది. దీనిపై దాదాపు ప్రతి సెలబ్రిటీ కూడా తమ విచారం, బాధను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే నయనతార తన అభిప్రాయాన్ని తెలిపింది. ఘటన జరిగిన పదిరోజుల్లోనే ఈ విధంగా నిందితులు ఎన్ కౌంటర్ చేయడంపై దేశంలో హర్షం వ్యక్తమైంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

justice served ⚖

A post shared by nayanthara🔵 (@nayantharaaa) on

మరింత సమాచారం తెలుసుకోండి: