ఇటీవల కొన్నాళ్లుగా మన దేశంలో ఆడపిల్లలకు భద్రత లేకుండా పోవడంతో పాటు వారిపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడికక్కడ అమ్మాయిలను దారుణంగా రేప్ చేసి ఆపై వారిని నిర్ధాక్షిణ్యంగా చంపేస్తున్న ఘటనలు అందరిలోనూ ఎంతో భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ఒకరకంగా ఇటువంటి ఘటనలు మరింతగా పెరగడానికి యువత పోర్న్ సైట్స్ చూడడం కూడా కొంత కారణం అని అంటున్నారు మానసిక నిపుణులు. చిన్నవయసులోనే చాలామంది యువత తమ మొబైల్ ఫోన్స్ లో పోర్న్ సైట్స్ ని ఓపెన్ చేసి చూడడం, 

 

ఆ విధంగా తాము కూడా చేయాలనే కోరికలు వారిలో మరింతగా పెరగడం వంటివి ఒకరకంగా అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరగడానికి కారణభూతంగా నిలుస్తున్నాయని వారు అంటున్నారు. వాస్తవానికి ఇటీవల ప్రభుత్వం కూడా పోర్న్ సైట్స్ పై కొంత నియంత్రణ విధించడంతో పాటు ముఖ్యమైన కొన్ని సైట్స్ ని బ్యాన్ కూడా చేయడం జరిగింది. అయితే ఎప్పటికపుడు వాటిని మళ్ళి యుఆర్యెల్స్ మార్చి మార్చి కొందరు దుండగులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇక కొద్దిరోజుల క్రితం దేశవ్యాప్తంగా కలకలం రేపిన లేడీ వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతం తరువాత దేశవ్యాప్తంగా రాజకీయ నాయకుల పై కూడా ఒత్తిడి పెరిగింది. 

 

కాగా ఈ విషయమై నిన్న జరిగిన ఒక సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా మరికొందరు రాజకీయ నాయకులు సైతం పోర్న్ సైట్స్ పై పూర్తిగా నిషేధం విధించాలని గట్టిగా వాదించినట్లు సమాచారం. అంతేకాక ఆయనతో పాటు మరికొందరు సీనియర్ నాయకులు కూడా పోర్న్ సైట్స్ పై ధ్వజమెత్తారని, అలానే వారిని వాదనను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నాయకులు, అతి త్వరలో పూర్తి స్థాయిలో పోర్న్ సైట్స్ ని నిషేధించేలా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అందుకు గాను అతి త్వరలో ఒక ప్రత్యేక సాంకేతిక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్టు చెప్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుండి అధికారికంగా ఎటువంటి ప్రకటన లేనప్పటికీ, అతి త్వరలో మాత్రం అటువంటి సైట్స్ ని పూర్తిగా నిషేధించే అవకాశం లేకపోలేదని అంటున్నారు కొందరు టెక్ నిపుణులు మరియు విశ్లేషకులు.......!!  

మరింత సమాచారం తెలుసుకోండి: