దిశ హత్యాచార మరియు హత్య ఘటన తదనంతర పరిణామాలు సమాజం ముందు ఉంచిన ప్రశ్నలు ఏంటని ఒకసారి సమీక్షుంటే చాలా విషయాలు మన కళ్ళకు కనిపిస్తున్నాయి, నిందితులకు పోలీసులు విధించిన శిక్ష  ప్రజల   దృష్టిలో చిన్నదే, ఎందుకంటే ఆ అమ్మాయి అనుభవించిన నరకయాతన ముందు ఇదేంత అన్నదే నా భావన, ఒక్క బుల్లెట్ తో ఒకేసారి ప్రాణం పోయింది. 

ఏది ఏమైనా పోలీస్ చర్య సమర్ధనీయమే, ఇది నేరస్తులకు, ఉన్మాదులకు ఒక గట్టి హెచ్చరికే తెలంగాణ పోలీస్ నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ దేశంలో మిగతా రాష్ట్రాల తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం లో పోలీస్ ల పనితీరు, శాంతిభద్రతల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వ విధానాలు ప్రశంశనీయంగానే ఉన్నాయి ఒక వికారుద్దీన్, నయీమ్ ఎన్ కౌంటర్  నేడు ఈ ఘటన లే వారి ప్రతిభ కు నిదర్శనం. షీ టీమ్స్ కూడా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. కానీ ఇది సరిపోదు ఇంకా తీసుకోవాలిసిన చర్యలు చాలానే ఉన్నాయి.. ముందు ప్రతి విషయాన్ని రాజాకీయం చేయటం, హద్దులు లేని విమర్శలు చేయడం మాని, విలువైన సలహాలు ఇవ్వటం ప్రతిపక్షాలు నేర్చుకోవాలి అని సాధారణ ప్రజలు కోరుకుంటున్నారని అంచనా. 

మహిళను ఆది శక్తిగా మొక్కే మన దేశంలో మహిళలకు రక్షణగా కఠిన చట్టాలు చేయాలనే ఆలోచన మన ఢిల్లీ పెద్దలకు ఎప్పుడు వస్తుందో అని వేచి చూస్తున్నారు.  ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీరో ఎఫ్ ఐ ఆర్  అంశాన్ని మళ్ళీ ముందుకు తెచ్చి దీని  హోమ్ మినిస్టర్  మొహ్మద్ అలీ ప్రారంభించాలని ప్రకటించారు. అలాగే యువకులకు   అతను జనం లో అవగాహన రావాలి అని మన ఇంట్లో మగ పిల్లలకు ఆడ పిల్లలను గౌరవించే సంస్కారం నేర్పాలి అని , ఇందులో ఉపాధ్యాయుల పాత్ర, తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకం అని , ఎంత మంది పోలీసులు ఉన్నా మన భాద్యత కూడా కీలకం అని అతడు సూచించారు. ఏది ఏమైనా మహిళ పూజించబడే మన కర్మ భూమి వేద భూమిలో ఇలాంటి సంఘటనలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు మన దేశానికి  దిశా  నిర్దేశం చేశామని మళ్ళీ  దేశంలో ఏ ఆడపిల్లకు ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆకాంక్షిస్తున్నానని మీడియా తో మాట్లాడుతూ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: