దిశ హత్య కేసు నిందితులలో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుక తల్లిదండ్రులు చిన్నవయస్సులోనే చనిపోయారు. రేణుక అమ్మమ్మ రేణుకను పెంచి పెద్ద చేసింది. రేణుకకు చెన్నకేశవులు సమీప బంధువు కావటంతో అతనితో రేణుకకు స్నేహం కుదిరింది. ఆ స్నేహం ఆ తరువాత ప్రేమగా మారింది. ప్రేమ విషయం రేణుక అమ్మమ్మకు తెలియటంతో రేణుకను అమ్మమ్మ మందలించింది. 
 
ఆ తరువాత రేణుక, చెన్నకేశవులుకు ఏడు నెలల క్రితం వివాహం జరిగింది. భర్త చెన్నకేశవులు నెలలో 20 రోజులు లారీ క్లీనర్ పని చేస్తున్నానని చెప్పిన మాటలను నమ్మిన రేణుక తన భర్త వ్యసనాలకు బానిసయ్యాడని, తప్పుడు పనులు చేస్తున్నాడని మాత్రం గుర్తించలేకపోయింది. తల్లిదండ్రులు లేకపోవడంతో భర్తే ప్రపంచంగా బ్రతుకుతున్న రేణుక గర్భవతి కావటంతో ఆ సంతోషం రెట్టింపైంది. 
 
కానీ రేణుక కలలో కూడా ఊహించని విధంగా తన భర్త మరో స్త్రీకి అన్యాయం చేశాడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. పోలీసులు తన భర్తను అరెస్ట్ చేసిన తరువాత తన భర్త తప్పు చేస్తే ఎలాంటి శిక్ష అయినా విధించవచ్చని చెప్పింది. కానీ ఎన్ కౌంటర్ లో తన భర్త చనిపోవటంతో రేణుక కన్నీటి పర్యంతమైంది. పోలీసులు దిశ కేసు నిందితుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపణలు చేసింది. 
 
తనకు పుట్టబోయే బిడ్డ తన తండ్రి ఎక్కడ అని అడిగితే ఏమని సమాధానం చెప్పాలని రేణుక ప్రశ్నిస్తోంది. నేరం చేసినట్లు రుజువు చేయకముందే చంపేయడం ఏంటని రేణుక ప్రశ్నిస్తోంది. కుటుంబానికి జీవనాధారమైన తన భర్త చనిపోయాడని తానెలా బతకాలని, అత్తామామలను ఎలా పోషించాలని రేణుక ప్రశ్నిస్తోంది. నిందితులను న్యాయపరంగా శిక్షించాలి కానీ ఎన్ కౌంటర్ చేయటం ఏమిటని రేణుక ప్రశ్నిస్తోంది. దేశంలో ఇలాంటి ఘటనలు జరగలేదా...? వారిని పందుల్లా జైళ్లలో పెట్టి మేపుతున్నారని రేణుక అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: