దిశ అత్యాచారం, హత్య ఘటన తర్వాత సమాజంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ ఘటన అందరినీ కలిచివేసింది. అందుకేనేమో.. ఈ ఘటన తర్వాత సైబరాబాద్‌ పోలీస్‌ వాట్సాప్‌ (9490617444)కు కోట్లలో మెస్సేజులు వచ్చాయట. విపరీతంగా మెస్సేజులు వస్తుండటంతో ఏకంగా వాట్సప్ సంస్థకే దీనిపై అనుమానం వచ్చిందట. దీంతో వాట్సాప్‌ సంస్థ అనుమానంతో ఆ నంబరుకు సేవలను టెంపరరీగా నిలిపివేసింది.

 

వాట్సప్ నిబంధనల ప్రకారం.. ఏదైనా అసహజంగా ఉంటే.. ఆ నంబరును టెంపరరీగా ఆపేస్తారు. వివరణ తీసుకున్న తర్వాత మళ్లీ పునరుద్ధరిస్తారు. ఇంతకీ అలా నిలిపేసిన ఆ వాట్సప్ నంబర్ ఎవరిదనుకుంటున్నారా..అదే మన సైబరాబాద్ పోలీసుల వాట్సప్ నంబర్. తమ నెంబర్ ఆపేయడంతో సైబరాబాద్‌ పోలీసులు షాక్ అయ్యారు.

 

ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని.. వాస్తవ పరిస్థితిని వివరిస్తూ ఆ సంస్థకు మెయిల్‌ పంపారు. ప్రస్తుతం తమ నెంబర్ నిలిపేయడంతో దాన్ని మళ్లీ వాడుకలో తెచ్చే వరకూ.. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. తాత్కాలికంగా మరో వాట్సాప్‌ నంబరు (7901114100)ను అందుబాటులోకి తెచ్చారు.

ఏకంగా వాట్సప్ సంస్థకే దిమ్మతిరిగిపోయేలా సందేశాలు వెల్లువెత్తాయంటే.. జనాగ్రహం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: