దేశంలో సంచలనం సృష్టించిన దిశ అతిచార, హత్యకేసులో నిందితులుగా భావిస్తున్న నలుగురిపై ఎన్కౌంటర్ చేసే చంపారు తెలంగాణ పోలీసులు. చాలా మంది సామాన్యులు, సెలబ్రిటీలు ఈ ఎన్ కౌంటర్ నీ సమర్థించారు. ఆ అమ్మాయికి న్యాయం జరిగిందని అందరూ అన్నారు. అదే విధంగా ఈ ఎన్ కౌంటర్ పై విమర్శలు కూడా చాలానే వచ్చాయి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ జనాల కోపాలను చల్లార్చే ప్రయత్నం లో ఈ ఎన్ కౌంటర్ చేశారా అంటున్నారు. కొందరు అదే బడాబాబులు పిల్లలు అయితే మీరు ఇలానే చేస్తారా అని కూడా ప్రశ్నిస్తున్నారు.

 

కొందరు న్యాయవాదులు, రాజ్యాంగాన్ని తెలిసినవారు ఈ చర్యని దుయ్యబట్టారు. కానీ ఇలాంటి వాళ్ళకి సామాన్యుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. నిజానికి సమ్యస్య అంత మన న్యాయ వ్యవస్థలో ఉంది. చాలా మందికి కోర్టులో న్యాయం జరుగుతుందని ఇప్పటికే నమ్మకం లేదు. చివరికి దీని పరిష్కారం కూడా న్యాయ వ్యవస్థ సమూల ప్రక్షాళనలో ఉందని తెలుస్తోంది.

 

ఆధునిక యుగంలో ఒక కేసు పదేళ్లు 20 ఏళ్లు సాగదీయడం సరికాదు. ఎప్పుడో ఒక కేసు విచారణ ఆలస్యం అయిందంటే సరే కానీ ప్రతి కేసుకు ఇంత సమయం ఎందుకు?  దీనికి కారణాలు ఏంటి? కోర్టులు లేవు..  స్టాఫ్ లేరు.. జడ్జీలు లేరు.. లాయర్లు లేరు అంటారు. అసలు కోర్టులో సంఖ్య ఎందుకు పెంచకూడదు..?? అలాగే జడ్జీలు కొత్త నియమించవచ్చు కదా. నేరాలు పెరిగే కొద్ది కోర్టుల సంఖ్యలో కూడా పెరిగి దాని త్వరగా పరిష్కారం అయ్యే మార్గం చూడాలి.

 

ఇలాంటి ప్రశ్నలు ఎందుకు మన మేధావులు ప్రశ్నించారు..?? అని ఆ లేఖలో అతను రాశాడు. ఆ మేధావులు ,మన రాజ్యాంగ నిపుణులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పోలీసు వ్యవస్థను, న్యాయ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు. బాధితులకి భారతీయ న్యాయ శాస్త్ర ప్రకారం న్యాయం జరిగేలా చూడండి అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. అలా జరిగితే ఇప్పుడు ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత సాధారణ ప్రజలు ఎందుకు సంతోష పడతారు అంటూ ప్రశ్నించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: