దిశ కేసులో విచార‌ణ‌, ద‌ర్యాప్తుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ పై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మందితోస్పెష ల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ను ఏర్పాటుచేసింది. ప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎన్ కౌంటర్పై దర్యాప్తుకు సిట్ ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం జీవో విడుదల చేసింది . దర్యాప్తును పూర్తి చేసి కోర్టుకు సమర్పించాలని సిట్‌ను ఆదేశించింది. ఇదిలాఉండ‌గా, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీ య మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్చార్సీ) బృందం ఆదివారం కూడా విచారణ కొనసాగించింది. ఘటనకు సంబంధించిన ప్రతి అం శంపైనా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతినిధి బృందం దృష్టి పెట్టింది. ఈ మేరకు హెచ్చార్సీ బృందంలోని ఏడుగురు సభ్యులు.. దిశ కుటుంబసభ్యులతోపాటు చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నలుగురు నిందితుల కుటుంబసభ్యులు, పంచనామా నిర్వహించిన నలుగు రు తాసిల్దార్లను రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో విచారించారు. కాగా, అఖిలభారత మహిళ సంఘం ఈ ఎన్‌కౌంటర్‌పై అభ్యంతరం తెలిపి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ విచార‌ణ స‌మ‌యంలోనే వాగ్వాదం చోటు చేసుకుంది.

 

 

తాజాగా హైకోర్ట్ ఫస్ట్ కోర్ట్ ముందు వాగ్వాదం ఈ ఎన్‌కౌంట‌ర్‌పై వాగ్వాదం చోటుచేసుకుంది. షాద్‌నగర్ ఎన్‌కౌటర్ ఫై ఫిర్యాదు చేసిన మహిళా సంఘాల న్యాయవాదులతో వాగ్వాదం జరిగింది. ఈ విచార‌ణ‌లో జోక్యం చేసుకునేందుకు తమకు హక్కు ఉందంటూ  మహిళా సంఘాల న్యాయవాదులు వాగ్వాదానికి దిగారు. మ‌రోవైపు ఇంకో వ‌ర్గానికి చెందిన కొంద‌రు న్యాయ‌వాదులు సైతం ఇదే రీతిలో ఘాటుగా స్పందించారు. దీంతో కోర్టు హాలులో వాగ్వాదాం జ‌రిగింది. హైకోర్ట్ న్యాయ‌మూర్తి జోక్యం చేసుకొని హాల్ నుంచి బయటకి వెళ్లాల‌ని ఇరు వర్గాలకు సూచించ‌డంతో అప్పుడు వివాదం స‌ద్దుమ‌ణిగింది.  దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌... ఫేక్ ఎన్‌కౌంటర్ ఎలా అవుతుందంటూ ఓ వ‌ర్గం లాయర్లు అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించ‌గా...త‌మ వాదనలు వినిపిస్తామంటూ మహిళా సంఘాల తరపు లాయర్లు స్పష్టం చేశారు.

 

 


కాగా, ఇప్పటికే నిందితుల తల్లిదండ్రులను జాతీయ మానవ హక్కుల సంఘం విచారించింది. వారి వద్ద నుంచి స్టేట్మెంట్ తీసుకుంది. మరోవైపు దిశ తల్లిదండ్రుల స్టేట్మెంట్ ను కూడా తీసుకోబోతున్నది. దిశ తండ్రి, ఆమె చెల్లి ఇద్దరినీ తెలంగాణ పోలీస్ అకాడమీకి పిలిపించారు. వీరి స్టేట్మెంట్ ను అధికారికంగా రికార్డ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: