ఇటీవల సీఎం జగన్-జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి రావడమే పవన్ కల్యాణ్ విమర్శలు చేసిన సైలెంట్ గానే ఉన్న జగన్....ఇటీవల పవన్ పెళ్లిళ్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంపై మాట్లాడుతూ...పవన్ ముగ్గురు భార్యలకు ఉన్న నలుగురు పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని సెటైర్ వేశారు.

 

ఇక దీనిపై జనసైనికులు తీవ్ర స్థాయిలో జగన్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అటు పవన్ కూడా జగన్ పై విమర్శల దాడి పెంచారు. జగన్ మాటలకు పవన్ కళ్యాణ్ కూడా కౌంటర్ ఇచ్చారు. ‘నా మూడు పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకు వెళ్లారా?’ అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ వేదికగా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటి నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఇక సమావేశాలు మొదటిరోజే అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరిగింది.

 

మొదట విద్యుత్ పి‌పి‌ఏల గురించి ఇరు పార్టీల మధ్య గొడవ జరుగగా, తర్వాత ఉల్లి ధరలపై టీడీపీ చర్చకు పట్టుబట్టగా, వైసీపీ మహిళల భద్రతపై చర్చ మొదలుపెట్టారు. ఈ క్రమంలో మహిళల మీద జరుగుతున్న దాడుల నేపథ్యంలో మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యల మీద సీఎం జగన్ అసెంబ్లీలో వివరించారు. అలాగే పవన్ కల్యాణ్ పై పరోక్షంగా కామెంట్లు చేశారు. జ‌గ‌న్ చేసిన ఈ కామెంట్ల‌కు అసెంబ్లీలో వైసీపీ స‌భ్యుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

 

‘కొందరు పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ మధ్య కాలంలో ఒకరు సరిపోరు. ఇద్దరు సరిపోరు. ముగ్గురు సరిపోరు. నలుగురు పెళ్లాలు కావాలని అంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఇక ఇలాంటి కేసులు గత ఐదేళ్లలో సుమారు 1100 కు పైగా నమోదయ్యాయని జగన్ తెలిపారు. అలాగే 2017లో 1046, 2018లో 1096 రేప్ కేసులు నమోదయ్యాయని అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: