దేశంలోనే ఎంతో కలకలం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య తర్వాత దేశంలోని న్యాయ వ్యవస్థని పటిష్టం చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న నలుగురిని పోలీసులు వారం రోజుల తర్వాత బూటకపు ఎన్ కౌంటర్లో చంపినట్టు కొందరు అనుమానిస్తున్నారు. అలాంటి కొందరు ఇలాంటి శిక్షలు పోలీసులు చేయకూడదు. దాని కోసం న్యాయ విభాగం అనేది ఒకటి ఉందని గుర్తు చేశారు. కానీ అన్ని కేసులు కూడా త్వరగా పరిష్కారం అవ్వట్లేదు అని కొందరు చెబుతున్నారు.

 

దాని కోసం న్యాయ చట్టాలో కొన్ని మార్పులు చేసి అలాగే దేశంలో తగినన్ని కోర్టులు, న్యాయవాదులు అలాగే  జడ్జీలను నియమించాలని అందరూ కోరారు. దానిలో భాగంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా యూపీ ఉంది. ఇక్కడ కూడా మహిళలపై అత్యాచారాలు, హత్య కేసులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. హైదరాబాదులో దిశ సంఘటన జరిగినప్పుడు అందరూ కూడా ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి న్యాయ చట్టం తీసుకొని రావాలి అని కొందరు కోరారు.

 

ఇటువంటి కేసులను త్వరగా విచారించేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 218 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అత్యాచారాల కేసుల కోసం  144 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, అలాగే  పిల్లలపై నేరాలకు 74 కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ఐ సందర్భంగా తెలిపారు.

 

మొన్న జరిగిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని కాల్చి చంపిన వైనంపై యూపీ సీఎం యోగిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం అసమర్థతపై అందరూ వేలెత్తి చూపారు. ఈ నేపథ్యంలో ఇలాంటి దారుణాలకి కారణం అయిన వారిపై కఠిన శిక్షలు పడేలా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: