మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే మీ ఆధార్ నెంబర్‌ను దీంతో అనుసంధానం చేసుకోండి.. లేకపోతే పీఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్‌లోకి రావు. రైతులకు ఆర్ధికంగా సహాయం చెయ్యాలనే ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 

                                   

అయితే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతులకు ఏడాదికి 6,000 రూపాయిలు అందిస్తుంది. ఈ 6,000 రూపాయిలు ఒకేసారి కాకుండా విడదల 3 దశల్లో అంటే 2,000 రూపాయిలు చొప్పున రైతులకు వారి అకౌంట్లలో ప్రభుత్వం ఈ డబ్బు అందిస్తుంది. అయితే ఈ నెల కూడా రైతుల అకౌంట్లలోకి రూ.2,000 వస్తాయి.. కానీ ఇప్పుడు అందరూ రైతులకు 2,000 రూపాయిలు రావడం లేదు.

                                  

కారణం రైతులు వారి బ్యాంక్ అకౌంట్లను ఆధార్ కార్డుతో లింక్ చేసుకోలేదు. వారు ఆధార్ తో బ్యాంకు అకౌంట్ ను లింక్ చేసుకుంటేనే 2,000 రూపాయిలు అకౌంట్‌లోకి వస్తాయి. కాబట్టి పీఎం కిసాన్ తాజా విడత రూ.2,000 డబ్బులు పొందాలంటే రైతులు వారి అకౌంట్లను ఆధార్‌తో లింక్ చేసుకోవాలి అని లేదంటే డబ్బులు అకౌంట్‌లోకి రావని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం పీఎం కిసాన్ రెండు వేల రూపాయిలు అకౌంట్లో పడాలంటే ఆధార్ తో బ్యాంకు అకౌంట్ అనుసంధానం వెంటనే చెయ్యండి.. లేదంటే 2000 రూపాయిలు మీ బ్యాంకు అకౌంట్ లో పడవు. 

మరింత సమాచారం తెలుసుకోండి: