ఇన్నాళ్లూ పార్ట్ టైమ్ పాలిటిక్స్ నడిపిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు ఫుల్ టైమ్ పొలిటిషియన్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.గతంలో జగన్ చేసినట్టుగానే.. యాత్రలు, దీక్షల ఫార్ములా ఫాలో అవుతున్నాడు. ఆయన ఈనెలలోనే రైతుల సమస్యలపై పవన్ కళ్యాణ్ సమరభేరి మోగించబోతున్నాడు.

 

ముందుగా రైతు సమస్యలపై ఆయన దృష్టి సారించాడు. ధాన్యం కొనుగోలు విషయంలో జగన్ ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వడం లేదన్నది పవన్ ఆగ్రహం.. అందుకే.. రైతుల సమస్యలపై తొలి దీక్షకు సిద్ధమవుతున్నాడు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేశామని చెప్తున్న ప్రభుత్వం, ఇప్పటి వరకు ప్రభుత్వం రైతులకు ధరలు చెల్లించలేదని, కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నది పవన్ వాదన.

 

అందుకే.. రైతుల సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేస్తున్నాడు. కానీ, ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం చెప్పలేదు. అసలు పవన్ ను పెద్దగా పట్టించుకోవడంలేదు. అందుకే.. పవన్, ఈనెల 12 వ తేదీన కాకినాడలో దీక్ష చేయబోతున్నారు. కాకినాడలో ఉదయం 8 గంటల నుంచి ఈ దీక్ష ప్రారంభం కాబోతుంది. ఈ దీక్షకు జనసైనికులు, రైతులు భారీ సంఖ్యలో కదిలిరావాలని ఆ పార్టీనేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

 

అయితే ఇప్పటి నుంచే దీక్షలు, యాత్రలు అంటూ హడావిడి చేయడం అవసరమా అన్న వాదన కొందరిలో ఉంది. అయితే ఎప్పుడో నాలుగున్నరేళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నాయి కదా అని నిర్లక్ష్యం వహించకుండా ఇప్పటి నుంచే గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవాలన్నది పవన్ వ్యూహం కావచ్చు. కనీసం ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగితే ఆ తర్వాత సత్తా చాటవచ్చన్నది పవన్ ప్లాన్ గా కనిపిస్తోంది. చూడాలి మరి ఈ వ్యూహం ఎంత వరకూ ఫలిస్తుందో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: