మాములుగా విందు భోజనం  అంటే ఎన్నో పదార్ధాలు ఉంటాయి.  ఆ పదార్ధాలకు తోడుగా చివర్లో కిళ్లీ ఉంటుంది.  మాములుగా మన భోజనాల్లో కిళ్లీ ఖరీదు ఎంత ఉంటుంది.  మహా అయితే 50 లేదంటే బాగా ఎక్కువ అనుకుంటే ఓ వంద అనుకోవచ్చు.  కానీ, ఎంపీగారు ఇస్తున్న విందులో మాత్రం కిళ్లీనే హైలైట్ అవుతుందట.  ఈ కిళ్లీ ఖరీదు ఏకంగా వెయ్యి రూపాయలు అని అంటున్నారు.  అంతగా ఏముందో ఆ కిళ్లీలో అని తెలిసినవాళ్లంతా నోరెళ్లబెడుతున్నారు.  


నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈనెల 11 వ తేదీన ఢిల్లీలో భారీ విందు ఏర్పాటు చేశారు.  దాదాపుగా 3వేలమంది వీవీఐపీ, విఐపిలకు ఆహ్వానం పంపారు.  ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, వీరితో పాటుగా సినిమా స్టార్స్ కూడా ఈ ఆహ్వానం అందింది.  ప్రధాని మోడీ, అమిత్ షాలు ఈ ఆహ్వానం మేరకు విందుకు హాజరు కాబోతున్నటుగా తెలుస్తోంది.  


నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు రాజకీయాల్లోకి రాకమునుపు అయన ఓ వ్యాపారవేత్త.  అనేక  రాష్ట్రాల్లో ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి.  బిజినెస్ మెన్ గా సక్సెస్ అయ్యాక అయన రాజకీయాల్లోకి వచ్చారు.  రాజకీయాల్లోకి వచ్చిన తరువాత 2014 లో నరసాపురం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.  ఆ తరువాత 2019లో వైకాపా నుంచి పోటీ చేసి విజయం సాధించారు.  


ఇక ఇదిలా ఉంటె, ఎంపీ ఢిల్లీలో అనుసరిస్తున్న విధానం వైకాపాను కొంత ఇబ్బంది పెడుతున్నది.  బీజేపీ నేతలతో టచ్ లో ఉంటుండటంతో జగన్ క్లాస్ తీసుకున్నారు.  అదే విధంగా ఇటీవలే మోడీ పార్లమెంట్ ఆవరణలో ఏం రాజుగారు ఎలా ఉన్నారు అనే మాట అన్న తరువాత ఈ వివాదం మరింత ముదిరింది.  ఇప్పుడు ఎంపీ పార్టీ ఇవ్వడం.. ఆ పార్టీకి మోడీ, షా ఇద్దరు హాజరు అవుతుండటంతో మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి.  ఈ అనుమానాలను ఎలా నివృత్తి చేసుకుంటారో చూడాలి.  రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు కదా.  

మరింత సమాచారం తెలుసుకోండి: