ఎన్ఆర్సి... ఈ పేరు వింటే వివిధ దేశాల నుంచి ఇండియా వచ్చి స్థిరపడిన ముస్లింలు భయపడుతున్నారు.  పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ ల నుంచి ఇండియా వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు.  అక్రమంగా వలస వచ్చి స్థిరపడిన వారిని గుర్తించి తిరిగి వారి దేశాలకు పంపడమే ధ్యేయంగా ఈ ఎన్ ఆర్సి బిల్లును తీసుకొచ్చారు.  వివిధ దేశాల నుంచి ఇండియాలోకి వచ్చిన హిందూ, క్రిస్టియన్, సిక్కు, పారసీ  ఇలా అందరికి పౌరసత్వం ఇవ్వబోతుంది.  


కానీ, అక్రమంగా ఇండియాలోకి వచ్చిన ముస్లింలకు మాత్రం ఎన్ ఆర్సి పౌరసత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండటం లేదు. ఇప్పటికే అస్సాంలో 19 లక్షల మంది అక్రమ వలసదారులు గుర్తించింది.  ఈశాన్య రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.  ఈశాన్య రాష్ట్రాల హక్కులు, వారి సంస్కృతీ, సంప్రదాయాలు వివిధ దేశాల నుంచి వచ్చిన వలసదారుల వలన ఇబ్బందులు కలుగుతున్నాయని వారు భావిస్తున్నారు.  


అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  ఈ బిల్లుపై నిన్నటి రోజున పార్లమెంట్ లో వాడీవేడి చర్చ జరిగింది.  ఈ చర్చలో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.  వివిధ పార్టీల నేతలు ఈ బిల్లును వ్యతిరేకించాయి.  చర్చ జరిపేందుకు ఓటింగ్ పెట్టగా అందులో 293 మంది చర్చ జరిపేందుకు అనుకూలంగా ఓటు వేశారు.  82 మంది మాత్రం అనుకూలంగా ఓటు వేయలేదు.  


ఆ తరువాత ఈ బిల్లుపై చర్చ జరిపారు.  ఒక్క సవరణ విషయంలో చర్చ జరిగి బిల్లు ఆమోదం కోసం ఓటింగ్ నిర్వహించగా అనుకూలంగా అనుకూలంగా 311 మంది వ్యతిరేకంగా 80 మంది మాత్రమే ఓటు వేశారు.  కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎంతో పాటు తెరాస పార్టీ కూడా వ్యతిరేకంగా ఓటు వేసింది.  కానీ, వైకాపా, శివసేన మాత్రం అనుకూలంగా ఓటు వేయడం విశేషం.  కాగా, ఈ బిల్లును ఇప్పుడు రాజ్యసభలో ప్రవేశపెట్టబోతున్నారు.  రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ ఎత్తులు వేస్తున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: