ఏపీ అసెంబ్లీలో సోమవారం మహిళల భద్రత గురించి చర్చ జరిగింది. ఈ చర్చ సమయంలో టీడీపీ నేతలు ఉల్లి పాయల సమస్యను ప్రస్తావించారు. ఉల్లి సమస్యను తప్పుదారి పట్టించేందుకే వైసీపీ మహిళల భద్రత అంశాన్ని తెచ్చిందని టీడీపీ నేతలు విమర్శించారు. దీన్ని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా దీటుగా నే ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డల మానప్రాణాల భద్రత అన్న విషయంపై చంద్రబాబుకు బాధ లేదని విమర్శించారు.

 

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఓ అడుగు ముందుకేసి చంద్రబాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఆ బాధ ఏంటో ఆయనకు తెలియదంటూ విమర్శించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..” ఈ రోజు టీడీపీ సభ్యుల గొడవ చూస్తే ఎక్కడ కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ గురించి మాట్లాడుతారో..ఎక్కడ లోకేష్‌ ఫోటోల గురించి మాట్లాడుతారో..ఎక్కడ బాలకృష్ణ అమ్మాయి కనిపిస్తే కడుపు చేయాలి, కమిట్‌ కావాలన్న అంశం గురించి మాట్లాడుతారో అన్న భయం టీడీపీ నేతల్లో ఉంది. ఈ రోజు మహిళల భద్రత కోసం ఒక ఎస్సీ మహిళను హోం మంత్రిని చేసిన ఘనత వైయస్‌ జగన్‌కు దక్కిందని విమర్శించారు రోజా.

 

13 సంవత్సరాలు సీఎంగా చేశానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఆడబిడ్డల భద్రత గురించి తెలియదా ? అంటూ రోజా నిలదీశారు. మహిళల కోసం ప్రత్యేక చట్టం తెస్తామని ఇవాళ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. అలాగే ఉల్లిపాయల గురించి కూడా చర్చించేందుకు సమయం కేటాయిస్తామని సీఎం చెప్పారు.

 

గతంలో చంద్రబాబు అన్నారు కదా..కోడలు మగబిడ్డను కంటే అత్త సంతోషించదా అని ఆడవారి పుట్టుకనే విభేదించిన చంద్రబాబు ..ఇవాళ ఆడవాళ్ల భద్రత గురించి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. దిశ సంఘటన తరువాత ఆడవాళ్లు కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లాలంటే భయపడుతున్నారు. అంతకుముందు రిషితేశ్వరి, ఆ ముందు నిర్భయ, స్వప్నిక, ప్రతిణ, రేపు ఎవరు అని ఆడవాళ్లు భయపడుతున్నారు. దిశను అత్యాచారం చేసిన నిందితులకు శిక్ష వెంటనే పడాలని దేశంలోని అందరూ కోరారని గుర్తు చేశారు రోజా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: