శృంగారం అనగానే రతీ మన్మథులు గుర్తుకు వస్తుంటారు.  నేటి సమాజంలో శృంగారం అంటే విచ్చలవిడిత తనం అయ్యింది..కానీ ఒకప్పుడు శృంగారం ప్రేమకు స్వరూపంలా ఉండేది.  తెలంగాణలో వరంగల్లు ఒకప్పుడు ఓరుగల్లు అనేవారు.  వరంగల్ లొ అలనాటి రాజుల రాజరిక వ్యవస్థను కన్నులకు కట్టినట్టు ఇప్పటికీ ఆ గుర్తులు చూస్తుంటే తెలుస్తుంది.  వరంగల్ అనగానే మనకు కాకతీయ మహారాజులు గుర్తుకు వస్తారు… కాకతీయులు అనగానే తక్షణం మనకు దేవాలయాలు, యుద్ధాలే గుర్తుకు వస్తాయి.  కేవలం దేవాలయాలే కాకుండా శృంగార బావిని కూడా నిర్మించింది కాకతీయులే. వరంగల్ జిల్లాలో వెలుగుచూడని కాకతీయుల కాలం నాటి ఎన్నో కట్టడాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఇందులో బాహ్యప్రపంచానికి తెలియని రహస్యాలు ఎన్నో దాగున్నాయి. శృంగారబావి కొలువు తీరింది. ఇక ఓరుగల్లు అనగానే.. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణి రుద్రమదేవితో పాటు ఆ వంశానికి చెందిన అనేకమంది ఈ శృంగార బావిలో స్నానం చేశారు.

 

రాణి రుద్రమ్మ ఇక్కడ స్నానం చేయడం వల్ల ఈ శృంగార బావికి చాలా ప్రాచూర్యం కలిగింది.  అందువల్లే ఈ బావిని రాణి రుద్రమ్మ శృంగార బావి అని పిలుస్తారు. ఇది ఎన్నో రహస్యాలకు నిలయం. ఈ రహస్యాల ఛేదన కోసం ఇప్పటికీ పరిశోధనలు సాగుతున్నాయి. శృంగార బావి మూడు అంతస్తులతో నిర్మితమైనది. ఈ బావి లోపలికి దిగితే టైం మిషన్ లో వెలుతున్నామా? అన్న భావన కలుగుతుంది. అంటే చరిత్ర పుటల్లోకి వెలుతున్న భావన కలుగుతుంది. అనేక చారిత్రాత్మక విషయాలు గుర్తుకు వస్తాయి.  మొదటి అంతస్తులో 9 స్తంభాలు, రెండో అంతస్తులో 4 స్తంభాలు, మూడో అంతస్తులో 2 స్తంభాలతో ఈ బావిని నిర్మించారు.  

 

 ఈ బావిని చూస్తుంటే చరిత్ర పుటల్లోకి వెలుతున్న భావన కలుగుతుంది అన్నమాట.అనేక చారిత్రాత్మక విషయాలు గుర్తుకు వస్తాయి.అనేర రహస్యాలకు నిలయమైన ఈ బావి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ బావి మరో గొప్పతనం ఏంటేంటే..శృంగార బావిలో అంతః పుర స్త్రీలు స్నానం చేసే సమయంలో నీళ్లు ఎంత అలజడిగా ఉన్నా, ఎవరైనా చూస్తే వారి ప్రతి బింబం నీటిలో కనిపించేలా ఈ బావిని నిర్మించారు.

 

దీంతో భౌతిక శాస్త్రానికి కూడా అంతుబట్టని పరిజ్జానాన్ని ఈ బావి నిర్మాణంలో వినియోగించినట్లు చెబుతారు.  ఎంతటి మండుటెండలు కాచినా..  ఈ బావిలోని నీరు ఎండిపోదు. కరువు సమయాల్లో కూడా ఈ బావిలోని నీరు చల్లగా ఉండటం కూడా విశేషం.  మొత్తానికి నేటి తరానికి తెలియకుండా క్రమంగా కనుమరుగయిపోతున్నాయి. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవలసిన ఇంజనీరింగ్ నైపుణ్యమే శృంగార బావి. 

మరింత సమాచారం తెలుసుకోండి: