జగన్మోహన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మధ్య ముదరుతుతున్న వివాదం వెనుక చంద్రబాబునాయుడున్నారా ? అందరిలోను ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి.  రెండుసార్లు జగన్ కు అమిత్ అపాయిట్మెంట్ ఇచ్చి ఢిల్లీ వచ్చిన తర్వాత కలవటానికి అమిత్ ఇష్టపడలేదు. దాంతో చేసేది లేక జగన్ వెనక్కు తిరిగివచ్చేసిన విషయం అందరూ తెలిసిందే.

 

అపాయిట్మెంట్ ఇవ్వకపోతే అసలు జగన్ ఢిల్లీకి వెళ్ళనే వెళ్ళరు.  కానీ అపాయిట్మెంట్ ఇచ్చి కలవటానికి ఇష్టపడలేదంటే అర్ధమేంటి ?  అంటే ఉద్దేశ్యపూర్వకంగానే జగన్ ను అవమానించాలని అమిత్ డిసైడ్ అయ్యారు. మొత్తం ఎపిసోడ్  నరేంద్రమోడి ఆమోదం లేకుండా జరగదని అందరికీ తెలుసు.  కాబట్టే జరుగుతున్న వ్యవహారాల్లో చంద్రబాబు పాత్రపైనే అనుమానాలు మొదలయ్యాయి.

 

గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు కూడా కేంద్రం అపాయిట్మెంట్ ఇవ్వకుండా ఇలాగే అవమానించింది. కానీ అప్పట్లో మోడి అపాయిట్మెంట్ తీసుకోకుండానే ఢిల్లీకి వెళ్ళారు చంద్రబాబు. కానీ ఇపుడు అమిత్ అపాయిట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్ ఢిల్లీకి వెళ్ళారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్ ను తట్టుకోవటం చంద్రబాబు వల్ల కావటం లేదు. అందుకనే మోడిని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు వచ్చింది. ఇందులో భాగంగానే నలుగురు రాజ్యసభ ఎంపిలను బిజెపిలోకి పంపారు. దాంతో బిజెపిలో చేరిన సుజనా, సిఎం రమేష్ లాంటి వాళ్ళు  చంద్రబాబుకు అనుకూలంగా బిజెపి పెద్దల మనసు మార్చే ప్రయత్నాల్లో ఉన్నారు.

 

బిజెపిలో చంద్రబాబుకు అనుకూల వాతావరణం కల్పించాలంటే ముందు జగన్ తో సంబంధాలను కట్ చేయించాలి. ఇపుడా పనే ముమ్మరంగా జరుగుతున్నట్లే అనుకోవాలి. లేకపోతే ఓ ఐపిఎస్ అధికారిని ఇంటెలిజెన్స్ చీఫ్ గా జగన్ నియమించుకుంటే కేంద్రానికి ఆగ్రహం ఎందుకు రావాలి ? ఎవరెని ఎక్కడ నియమించుకోవాలన్నది పూర్తిగా జగన్ ఇష్టం. ఈ విషయంలోనే జగన్-అమిత్ మధ్య అగాధం పెంచిందిన ఎల్లోమీడియా ప్రముఖంగా కథనం అచ్చేసిందంటేనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: