నిన్నటి నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే ఈ సమావేశాలు పది రోజులపాటు కొనసాగనున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలు మొదలైన మొదటి రోజె  వాడివేడిగా జరుగగా  రెండో రోజు కూడా... ఏపీ అసెంబ్లీ వాడివేడిగా జరుగుతుంది. టిడిపి వైసిపి పార్టీల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. పంటలకు గిట్టుబాటు ధర పై చర్చించాల్సినదిగా అసెంబ్లీలో పట్టుబట్టిన టిడిపి సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పార్టీ ఆఫీసు కాదని అసెంబ్లీ అంటూ మందలించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఇంతలో చంద్రబాబు  కల్పించుకున్నారు. 

 

 

 

 దీంతో చంద్రబాబుకు స్పీకర్ తమ్మినేని కి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేయడంతో టిడిపి సభ్యులు అందరూ మండిపడ్డారు. స్పీకర్ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు టిడిపి సభ్యులు.అనంతరం  టిడిపి ఎమ్మెల్యే రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. విపక్ష నేతలు మాట్లాడేందుకు కనీసం అవకాశం కూడా ఇవ్వడం లేదని... ఇలా చేయడం దారుణం అంటూ ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర అందడంలేదని ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ ఆయన ఆరోపించారు. 

 

 

 

 మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు టిడిపి ఎమ్మెల్యే రామానాయుడు. అనంతరం మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు మాయమాటలు చెబుతూ అడుగడుగునా మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యే వరకు తాము పోరాటం చేస్తూనే ఉంటానని తెలిపారు. ఇదిలా ఉండగా అటు వల్లభనేని వంశీ కూడా అసెంబ్లీలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. వల్లభనేని వ్యాఖ్యలపై కూడా టిడిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: