ఇటీవల  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు రోజు రోజుకి చాలా  మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ లో చనిపోయిన సంగతి అందరికి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారనే విషయం హాట్ టాపిక్ గా మారడం జరిగింది. ఇక  సీపీ సజ్జనార్ మాట్లాడుతూ ప్రధాన నిందితుడు ఆరిఫ్ వయస్సు 26 ఏళ్లని, చెన్నకేశవులు, జొల్లు శివ, నవీన్ ల వయస్సు 20 ఏళ్లని తెలియచేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా  కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. మృతుల్లో ఇద్దరు మైనర్లని వారు మానవ హక్కుల సంఘానికి తెలియచేయడం జరిగింది.

 

దీంతో దీనికి సంబంధించిన ఆధారాలు చూపించాలని హక్కుల సంఘం కోరింది. వీరికి సంబంధించిన ఆధార్ కార్డులు, పాఠశాల బోనోఫైడ్ సర్టిఫికెట్లను అధికారులు సేకరించడం జరిగింది. నిందితుల  ఇంటికి వెళ్లి వీటిని తీసుకొని రావడం జరిగింది. అందులో ఒక నిందితుడి పుట్టిన రోజు 10 ఏప్రిల్ 2004గా ఉంది. దీని ప్రకారం అతని వయస్సు 15 సంవత్సరాల 8 నెలలు. మరో నిందితుడి పుట్టిన రోజు 2002 ఆగష్టు 15. దీని ప్రకారం అతని వయస్సు 17 సంవత్సరాల 6 నెలలు. ఆధార్ కార్డులో మాత్రం 2001గా ఉంది. వీరి ఆధార్ కార్డు తేదీలకు, పాఠశాల బోనోఫైడ్ తేదీలకు సరైన పొంతన లేదు అంటే నమ్మండి. చట్టం ప్రకారం పాఠశాల బోనోఫైడ్ ను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.

 

అదే విధంగా చెన్నకేశవులు, ఆరిఫ్ లు లారీ డ్రైవర్లని పోలీసులు తెలియచేయడం జరిగింది. కానీ వీరికి డ్రైవింగ్ లైసెన్స్ లు లేనట్టు సమాచారం. నిర్భయ చట్టం ప్రకారం మైనర్ల వయస్సును 16 సంవత్సరాలుగా మార్చడం జరిగింది. దీంతో ఒక్కరే మైనర్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ నిందితులంతా మేజర్లేనని, వారి పుట్టిన తేది వివరాలు సరిగ్గా లేకపోవడంతో అంచనాగా అలా నమోదు చేశారని పోలీసులు అంటున్నారు. ఇంకా చెన్నకేశవులు కిడ్నీ సంబధిత వ్యాదితో బాధపడుతున్నట్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే కదా. దాని చికిత్స నిమిత్త 2018 సెప్టెంబర్ 18నే బోనఫైడ్ సర్టిఫికెట్ తీసుకున్నట్లు తల్లిదండ్రులు తెలియచేయడం జరిగింది. ఇప్పటికే  చెన్నకేశవులకు పెళ్లైంది..  మరి ఇప్పుడు ఈ కేసు ఏ విధంగా మలుపు తిరుగుతుందో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: