భార్య ఇష్టం లేని భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నింది. ఈ మేరకు చాలా సార్లు ప్రయత్నం చేసి విజయం  సాధించలేదు  ప్రతిసారి భర్త తప్పించుకోనేసరికి ఈ సారి ఎలాగైనా అంతం చేయాలని గట్టి ప్లాన్ తో పన్నగానికి సిద్ధమైంది. కానీ పోలీసుల చొరవతో చివరికి కటకటాలపాలైంది. ఈ భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై నాగుల్ మీరా తెలిపిన సమాచారం ప్రకారం నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి గ్రామానికి చెందిన తెల్లం కృష్ణకు దాదాపు 15 ఏళ్ల క్రితం తన అక్క కూతురు శిరీషతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. భార్యాభర్తల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. మొదటి నుంచి అయిష్టంగా ఉన్న శిరీష భర్తను అడ్డు తొలగించుకోవాలని ఎప్పటి నుండో ఆలోచనలో ఉంది.

 

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శిరీష ఇంటి వద్ద చిన్నపాటి హోటల్‌ నడుపుకుంటుంది. ఈ క్రమంలో గత యేడాది గుంటూరు జిల్లా కారంపూడి మండలం చిన్నకొదవగండ్లకు చెందిన సిద్ధి సాయికుమార్‌ గ్రామంలో అరటి, మామిడిపండు విక్రయించేందుకు గ్రామానికి వచ్చాడు. పలుమార్లు హోటల్‌కు వెళ్లటంతో శిరీష అతనితో పరిచయం పెంచుకొంది. తన భర్తను అడ్డుతొలగించుకోవాలని మనసులో మాట అతనికి చెప్పింది. సాయికుమార్‌ మరో తొమ్మిది మందితో కలిసి ముఠాగా ఏర్పడి కృష్ణను అంతమొందించేందుకు పథకం రూపొందించాడు. హత్యకు నిందితులు 8లక్షల సుఫారీ ఒప్పందం చేసుకున్నారు.

 

మొదటి ప్రయత్నంలో అన్నంలో విషం కలిపి చంపాలనుకున్నారు. కానీ ఆ విషం అతనికి ఎక్కకపోవడంతో బతికిపోయాడు. రెండో సారి విషపు ఇంజక్షన్ తో ద్విచక్రవాహనంపై వస్తున్నాకృష్ణపై సుఫారీ గ్యాంగ్ మళ్ళీ ప్రయత్నించింది, కానీ ఈ సారి కూడా కృష్ణ తప్పించుకొని బయటపడ్డాడు. ఇవన్నీ కాదని పెద్ద ప్లాన్ తో సిద్ధం కావాలని భావించిన శిరీష ఇంట్లో నుండి వెళ్ళిపోయి గుంటూరుకు చేరుకుంది. ఇవేవి తెలియని కృష్ణ భార్య కనపడడం లేదని పిర్యాదు చేసాడు. లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయం తెలుసుకుకొని కంగుతిన్నారు. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రస్తుతం ఆ సఫారీ గ్యాంగ్ పరారిలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: