ఒక అమాయకురాలిని, మంచితనంతో మూగజీవాలకు సేవ చేయాలనే భావనతో వెటర్నరీ డాక్టర్‌గా పని చేస్తున్న దిశను అత్యంత దారుణంగా మట్టుబెట్టిన రాక్షసులు ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఈ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేయడమే కాదు, తెలంగాణ పోలీసుల చర్యలను అందరూ సమర్ధిస్తున్నారు కూడా.

 

 

ఇకపోతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని పౌర హక్కుల నేతలు చేస్తున్న విమర్శలను కూడా కొట్టిపారేస్తున్నారు. ఇకపోతే బ్రతికి ఉండి ఇంత దారుణం చేసిన వీరు మరణించాక కూడా ముప్ప తిప్పలు పెడుతున్నారు. వీరి డెడ్ బాడీలను సెక్యూరీటి మధ్య ఉంచి కేసు విషయం తేలేదాకా జాగ్రత్త పరస్తున్నారు అధికారులు.. ఇకపోతే వీరి చావులో ఎన్నో ట్విస్ట్‌లు, రోజుకో మలుపులతో సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తున్నాయి. దీనికంతటికి కారణం మానవహక్కుల అధికారులు కేసుపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టడం..

 

 

ఇకపోతే ఈ కేసు విషయం మరో కీలక మలుపు తిరిగింది. అదేమంటే నిందితులే స్వయంగా అత్యాచారం చేసిన తర్వాత హత్య చేసినట్లుగా ఆధారాలను సేకరించిన  పోలీసులు ఈ ఎవిడెన్స్‌ను ఎన్‌హెచ్అర్సీకి అందచేశారు. సెబరాబాద్ పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలతో సహా సమర్పించారు.. సంఘటన స్దలంలోని రక్తం మరకలు, లారీ క్యాబిన్‌లో దొరికిన సాక్ష్యాలతో సహా ఘటనా స్దలంలో లారీ తిరిగిన సీసీ పుటేజ్ లను కూడా ఎన్‌హెచ్అర్సీకి అందించారు..

 

 

ఇకపోతే చటాన్‌పల్లి వద్ద ఎన్‌కౌంటర్‌లో మరణించిన నిందితుల మృతదేహాలను శుక్రవారం వరకు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు కోర్టు తీర్పు కోసం ఎదురుచూడవలసి వస్తుందని వారి కుటుంబీకులు వాపోతున్నారు. మనలో మనమాట పోయిన వారు ఎలాగో పోయారు వారికోసం ఇంతగా టైం వేస్టు చేయడం అవసరమా అని కొందరు కామన్ మ్యాన్లు అనుకుంటున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: