నిన్నటి నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే మొదటి రోజు సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా దిశ ఎన్కౌంటర్ గురించి మాట్లాడిన జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై  ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై అసెంబ్లీలో వివరించారు. ఈ సందర్భంగా మహిళలపై జరిగే అత్యాచారాలపై కొత్త చట్టం తీసుకు వస్తా అంటూ ముఖ్యమంత్రి జగన్ సభలో మాట్లాడారు. మహిళలకు అన్యాయం జరిగిన కేసులో మూడు వారాల్లోనే శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దీని కోసం కొత్త చట్టం తీసుకొస్తామని అన్నారు. 

 

 కాగా జగన్ పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ సినీ నటి విజయశాంతి స్పందించారు. జగన్ తీసుకున్న నిర్ణయం పై ప్రశంసలు కురిపించారు విజయశాంతి. మహిళల భద్రత గురించి ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఆయన అన్నారు. అత్యాచార బాధిత మహిళలకు సత్వర న్యాయం జరిగేలా కొత్త చట్టం తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం శుభపరిణామమని విజయశాంతి అభిప్రాయపడ్డారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ప్రవేశ పెట్టబోతున్న తరహా చట్టాన్ని తెలంగాణలో కూడా తేవాలని ఆమె అన్నారు. 

 


 ఇటీవల షాద్నగర్ వెటర్నరీ డాక్టర్ దిశ పై జరిగిన అమానుష దాడితో యావత్ దేశం ఒక్క సారిగా ఉలిక్కి పడిందని .. మరోసారి ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చి బాధిత మహిళలకు సత్వర న్యాయం జరిగేలా కొత్త చట్టాన్ని ప్రతిపాదనకు నిర్ణయం తీసుకుందని విజయశాంతి తెలిపారు. ఇదిలా ఉండగా అటు  ఏపీ అసెంబ్లీలో వాడివేడిగా ప్రశ్నోత్తరాలు జరుగుతూనే ఉన్నాయి. నేడు కూడా ఏపీ అసెంబ్లీ అట్టుడికిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: