ఈరోజు జరిగిన ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో టిడిపి పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... వైసిపి నేతలకు నాలెడ్జ్ లేదు.. తాను మాట్లాడేది విని నాలెడ్జ్ పెంచుకోండి అని అన్నాడు. ఆ తర్వాత సన్న బియ్యం ఇస్తానని చెప్పి... మళ్లీ తాము ఎక్కడ కూడా అది చెప్పలేదని అధికార పార్టీ వైసిపి చెప్తుందని అన్నాడు. ఇది విన్న కొడాలి నాని ఏదో మాట అన్నాడు. ఆ మాటతో విసిగిపోయిన అచ్చెన్నాయుడు ఇంకా మాట్లాడుతూ... ఎన్నికల ప్రచార సమయంలోనూ, ఆ తర్వాత గెలిచి పదవిలోకి వచ్చినా కూడా కొన్ని వందల సార్లు సన్న బియ్యం ఇస్తానని వైసిపి పార్టీ హామీ ఇచ్చిందని చెప్పారు. సన్న బియ్యం ఇస్తానని చెప్పి ఇప్పుడేమో ఈ వైసీపీ నేతలు దానికి పేరు మార్చి నాణ్యమైన బియ్యం చేశారని విమర్శించాడు.

ఈ వ్యాఖ్యలను విన్న తర్వాత.. కొడాలి నాని మాట్లాడుతూ... 'నాలెడ్జ్ అనేది బాడీలో ఉండదు, బ్రెయిన్ లో ఉంటది. అచ్చెన్నాయుడికి పెద్ద బాడీ ఉంది కాబట్టి... ఆయనకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని ఫీలవుతున్నారు. బాడీలో కాదు నాలెడ్జ్ ఉండేది, బ్రెయిన్ లో ఉంటుంది ముందు అది తెలుసుకో' అని అచ్చెన్నాయుడికి హితవు పలికారు. ఆ తర్వాత సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పలేదని వివరించాడు. దీంతో అచ్చెన్నాయుడు వాదనకు దిగాడు... ఈ క్రమంలోనే కొడాలి నాని... 'బాడీ ఉందని మీదకు రావొద్దు.. కూర్చోవోయ్, మీ లాగా బాడీ రావాలంటే గడ్డి తినమంటావా అంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.


ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మాట్లాడవలసిందిగా స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. దాంతో జగన్మోహన్ రెడ్డి లేచి.. 'ఈ శాసన సభలో బియ్యం గురించి ఎవరికైనా మాట్లాడే అర్హత ఉందంటే.. అది కేవలం మా రంగనాథ రాజు అన్నకే ఉంది. ఎందుకంటే.. అతను వెస్ట్ గోదావరి రైస్ మిల్లులకు ప్రెసిడెంట్. అతన్ని ఒక నిమిషం మాట్లాడనిద్దాం.' అని అన్నారు. ఆ తర్వాత అసలు సన్న బియ్యం అనే పదమే లేదని, స్వర్ణ బియ్యాన్నే సన్న బియ్యంగా ప్రజలు పిలుస్తారని వివరించాడు. అది తెలియని టీడీపీ నేతలు.. రంగనాథ రాజు అన్న చెప్పే మాటలను కోసేపు విని.. ఇంతకు ముందు అచ్చెన్నాయుడు నాలెడ్జ్, నాలెడ్జ్ అన్నారు కదా.. ఆ నాలెడ్జ్ ని పెంచుకోమని.. కౌంటర్ ఇచ్చాడు. ఆపై వైఎస్ఆర్ సీపీ నేత రంగనాథరాజు బియ్యాల రకాల గురించి వివరించారు. అప్పుడు టిడిపి నేతలు శ్రద్ధగా విని నాలెడ్జ్ పెంచుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: