నవంబర్ 27 వ తేదీ తెలంగాణ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయిన రోజు.  ఆరోజు రాత్రి 9:30 గంటల ప్రాంతంలో దిశ అనే ఓ వైద్యురాలిని నలుగురు నిందితులు పాశవికంగా హత్యాచారం చేసి హత్య చేశారు.  హత్య చేసిన తరువాత నిందితులు దిశను కాల్చేశారు.  అయితే, ఈ కేసులో నిందితులను 48 గంటల్లోనే అరెస్ట్ చేశారు.  దిశ నిందితుల ఎన్ కౌంటర్ తరువాత రాష్ట్రంలో పోలీసులు హీరోలు అయ్యారు.  తమ పిల్లలు తప్పు చేశారు.  చట్ట ప్రకారం ఎలాంటి శిక్ష విధించిన తమకు అభ్యంతరం లేదని చెప్పిన తల్లిదండ్రులు, పిల్లలను ఎన్ కౌంటర్ చేయడంతో షాక్ అయ్యారు.  


చట్ట ప్రకారం శిక్షిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదని, కానీ, చట్టప్రకారం కాకుండా ఇలా ఎన్ కౌంటర్ చేయడం బాగాలేదని, మైనర్ పిల్లలు అని చూడకుండా ఎన్ కౌంటర్ చేయడం న్యాయం కూడాదని తల్లిదండ్రులు చెప్పడంతో జాతీయ మానవ హక్కుల కమీషన్ ఈ విషయంపై దృష్టి పెట్టింది.  నిందితుల  కార్డులు సేకరించింది.  వారు చదువుకున్న పాఠశాలకు వెళ్లి ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు.  


ధ్రువీకరణ పత్రం ప్రకారం అందులో ఒకరు 15-08-2002 లో పుట్టాడు.  అంటే వయసు 17 సంవత్సరాల ఆరు నెలలు.  కానీ, ఆధార్ కార్డులో మాత్రం పుట్టిన సంవత్సరం 2001గా ఉన్నది.  ఇకపోతే మరొకరి ధ్రువీకరణ పత్రం ప్రకారం 10-04-2004లో జన్మించినట్టు ఉన్నది.  అంటే అతని వయసు 15 సంవత్సరాలు.  దీనిప్రకారం ఈ  ఇద్దరినీ మైనర్లుగా గుర్తించాలి.  కానీ, పోలీసులు మాత్రం చెన్నకేశవులు, శివ, నవీన్ ల వయసు 20 సంవత్సరాలని అంటున్నారు.  


ఆధార్, స్కూల్ ధ్రువీకరణ పత్రం ప్రకారం ఇద్దరు మైనర్లు అనే మాట నిజమే అయితే, పోలీసుల మెడకు ఈ ఎన్ కౌంటర్ ఉచ్చు పడుతుంది.  ఎందుకంటే,  చట్టాల ప్రకారం మైనర్ వ్యక్తులకు కఠిన శిక్షలు వేయకూడదు.  ఎన్ కౌంటర్ వంటివి చేయకూడదు.  కానీ, ఇక్కడ దిశ కేసు విషయంలో ఎన్ కౌంటర్ జరిగింది.  మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.  జాతీయ మానవ హక్కుల కమీషన్ సేకరించిన వివరాల ఆధారంగా పోలీసులపై చర్యలు తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: